అక్కడ కరోనా సామాజిక వ్యాప్తి దశకు చేరుకుందా..?

ఆఫ్రికాలో కరోనా వైరస్ తీవ్రరూపం దాల్చుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది.

అక్కడ కరోనా సామాజిక వ్యాప్తి దశకు చేరుకుందా..?
Follow us

|

Updated on: Jun 11, 2020 | 10:17 PM

కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. చైనాతో మొదలైన కరోనా దాడి ప్రపంచాన్ని చుట్టేస్తోంది. కొవిడ్ విశ్వవ్యాప్తం కావడంపట్ల ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఆఫ్రికాలో కరోనా వైరస్ తీవ్రరూపం దాల్చుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఖండంలో లక్ష కరోనా కేసులు నమోదు కావడానికి 98 రోజుల సమయం పట్టగా.. కేవలం గత 18 రోజుల్లోనే కేసులు 2 లక్షలకు పెరిగాయని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. ఆఫ్రికాలోని 54కు పైగా దేశాల్లో కరోనా మహమ్మారి సామాజిక వ్యాప్తి దశకు చేరుకుందని తెలిపింది. కొత్తగా నమోదవుతున్న గణాంకాలు కరోనా తీవ్ర ప్రతాపానికి ఇది సూచన అని డబ్ల్యూహెచ్‌వో ఆఫ్రికా చీఫ్ మిత్సిడిసో మొయెటి తెలిపింది. యూరోప్ దేశాల నుంచి వచ్చిన వారి ద్వారా కరోనా భారీగా వ్యాప్తి చెందిందనీ.. రాజధాని నగరాలు దాటుకుని గ్రామీణ ప్రాంతాలకు విస్తరించిందని చెప్పారు. గ్రామీణ ప్రాంతంలో వైద్య సదుపాయాలు అంతంత మాత్రం ఉండడంతో కరోనా వ్యాప్తి చెందుతోందన్న ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం నాటికీ ఆఫ్రికా ఖండంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 2,09,000 దాటాయి. అత్యధికంగా సౌతాఫ్రికాలో 55 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. జనం ఆరోగ్య నియమాలు ఖచ్చితంగా పాటించడం ద్వారా మాత్రం కొవిడ్ ను కంట్రోల్ చేయగలుగుతామని మిత్సిడిసో వెల్లడించారు.