మహిళల టీ20 ఛాలెంజర్‌కు వేదికవుతున్న యూఏఈ

మహిళల క్రికెట్‌కు మరింత ఆదరణ కల్పించేందుకు టీ20 ఛాలెంజర్‌ టోర్నీకి బీసీసీఐ రూపకల్పన చేసిన సంగతి తెలిసిందే. సూపర్‌నోవాస్‌, ట్రయల్‌బ్లేజర్స్‌, వెలాసిటీ జట్లు రౌండ్‌ రాబిన్‌ లీగ్‌లో తలపడనున్నాయి.

మహిళల టీ20 ఛాలెంజర్‌కు వేదికవుతున్న యూఏఈ
Follow us

|

Updated on: Oct 22, 2020 | 6:12 PM

Womens T20 Challenge : యూఏఈ.. మరో ఐపీఎల్‌కు వేదికగా మారబోతోంది. క్రికెట్ ప్రియులకు మరింత మజాను అందించేందుకు ఎడారి దేశాలు రెడీ అవుతున్నాయి. ఐపీఎల్-13తోపాటు ఉమెన్స్  టీ20 జరగబోతోంది.

మహిళల క్రికెట్‌కు మరింత ఆదరణ కల్పించేందుకు టీ20 ఛాలెంజర్‌ టోర్నీకి బీసీసీఐ రూపకల్పన చేసిన సంగతి తెలిసిందే. సూపర్‌నోవాస్‌, ట్రయల్‌బ్లేజర్స్‌, వెలాసిటీ జట్లు రౌండ్‌ రాబిన్‌ లీగ్‌లో తలపడనున్నాయి.

ఈ నేపథ్యంలోనే కోవిడ్‌–19 పరీక్షల అనంతరం గురువారం యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ బయల్దేరి వెళ్లారు. వారం రోజుల క్వారంటైన్‌ అనంతరం మహిళా క్రికెటర్లు బయో బబుల్‌లోకి అడుగుపెడతారు.

వెటరన్‌ ప్లేయర్లు మిథాలీ రాజ్, జులన్‌ గోస్వామి, హర్మన్‌ప్రీత్‌ సింగ్‌, స్మృతి మందాన తదితరులు ఈ టోర్నీలో పాల్గొననున్నారు. ఇందు కోసం వారు ఇప్పటికే యూఏఈకి ప్రత్యేక విమానంలో బయలు దేరారు.

షెడ్యూల్‌ ప్రకారం మూడు జట్లతో జరిగే నాలుగు మ్యాచ్‌ల మహిళల టీ20 ఛాలెంజర్‌ ట్రోఫీ షార్జా వేదికగా నవంబర్‌ 4 నుంచి 9 వరకు జరుగనుంది. పురుషుల ఐపీఎల్ జరుగుతున్న సమయంలోనే మహిళల కోసం యూఏఈలో మినీ సీజన్​ను​ నిర్వహించనున్నారు. ఈ మ్యాచులు మంచి ఆదరణ లభిస్తుందని బీసీసీఐ భావిస్తోంది. దీంతో మహిళల క్రికెట్‌ను ప్రోత్సహించాలని అనుకుంటోంది. ఇది సక్సెస్ అయితే వచ్చే ఏడాది నుంచి మన దేశంలో రంగుల ఆట ఆనందాన్ని పంచనుంది.