AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మా ఆయన ఎక్కువ ప్రేమిస్తున్నాడు..విడాకులివ్వండి!

భార్యాభర్తలు మధ్య డిస్టబెన్సెస్ అనేవి కామన్..అలాగే సర్దుబాట్లు కూడా జరుగుతూనే ఉంటాయ్. ఒకవేళ గొడవలు భరించలేని స్థాయికి వెళ్తే..భర్త నిత్యం వేధిస్తుంటే విడాకులు అడక్క తప్పదు. అయితే, ఓ భార్య మాత్రం వీటన్నింటికి పూర్తి విరుద్దం. భర్త తనతో పోట్లాడాలని, తనకు ఎదురు చెప్పాలని కోరుకొనే స్పెషల్ ఇల్లాలు. కానీ, ఆమెకు పూర్తి విరుద్ధమైన భర్త దొరికాడు. ఎక్కువగా ప్రేమిస్తాడు. ఆమె తిట్టినా, కొట్టినా ప్రేమతో భరిస్తాడు.  ఆమె అడిగిందే తడవుగా వంట కూడా చేసి పెడతాడు. […]

మా ఆయన ఎక్కువ ప్రేమిస్తున్నాడు..విడాకులివ్వండి!
Wife in UAE seeks divorce because Husband is too nice
Ram Naramaneni
|

Updated on: Aug 22, 2019 | 9:43 PM

Share

భార్యాభర్తలు మధ్య డిస్టబెన్సెస్ అనేవి కామన్..అలాగే సర్దుబాట్లు కూడా జరుగుతూనే ఉంటాయ్. ఒకవేళ గొడవలు భరించలేని స్థాయికి వెళ్తే..భర్త నిత్యం వేధిస్తుంటే విడాకులు అడక్క తప్పదు. అయితే, ఓ భార్య మాత్రం వీటన్నింటికి పూర్తి విరుద్దం. భర్త తనతో పోట్లాడాలని, తనకు ఎదురు చెప్పాలని కోరుకొనే స్పెషల్ ఇల్లాలు. కానీ, ఆమెకు పూర్తి విరుద్ధమైన భర్త దొరికాడు. ఎక్కువగా ప్రేమిస్తాడు. ఆమె తిట్టినా, కొట్టినా ప్రేమతో భరిస్తాడు.  ఆమె అడిగిందే తడవుగా వంట కూడా చేసి పెడతాడు. అంత అభిమానాన్ని, కేరింగ్‌ని తట్టుకోలేకపోయింది. కనీసం అప్పుడప్పుడు కూడా గొడవలు లేక బోర్ ఫీలయ్యింది . చివరికి కోర్టు మెట్లెక్కి.. భర్తతో విడాకులు కావాలని కోరింది. ఈ ఘటన యూఏఈలోని షరియత్‌లో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. షార్జాకు చెందిన జంటకి పెళ్లై ఏడాదైంది. విడాకులు కోరుతూ భార్య .. కోర్టుకు వెళ్లింది. తన భర్తకు, తనకు మధ్య ఎలాంటి గొడవల్లేని.. అతని ప్రేమను, మంచితనాన్ని తట్టుకోలేకపోతున్నానని పిటిషన్‌లో పేర్కొంది. ఆయనతో గొడవ లేకుండా ఉండటం.. నరకంగా ఉందంటూ తెలిపింది. ఎలాగైనా తనకు విడాకులు ఇవ్వాలని కోరింది. దీనిపై భర్తను ప్రశ్నించగా.. తన భార్య అంటే తనకు చాలా ఇష్టమని.. ఆమెతో తాను గొడవ పడలేనని చెప్పాడు. ఒకసారి తను బరువు తగ్గాలని కోరినందుకు.. చాలా కఠినమైన డైట్‌తో తగ్గిపోయానని చెప్పాడు. ఆ ప్రయత్నంలో తాను ఇబ్బందులు పడ్డా.. బరువు తగ్గానన్నాడు. గొడవ పడటం తన వల్ల కాదని తేల్చి చెప్పాడు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. ఇద్దరూ కలిసి కూర్చొని మాట్లాడుకోవాలంటూ.. తీర్పును వాయిదా వేశారు.