DMart: డీమార్ట్‌లో ధరలు అంత తక్కువగా ఎందుకుంటాయి..? సామాన్యుడి షాపింగ్ అడ్డా వెనుక అసలు సీక్రెట్స్ ఇవే!
DMart Prices: ఇతర కంపెనీల ఉత్పత్తులను తన షెల్ఫ్స్‌లో ఉంచడానికి డీమార్ట్ 'స్లాట్ ఫీజు' తీసుకుంటుంది. అలాగే సప్లయర్లకు త్వరగా పేమెంట్స్ చేస్తుంది. దీనివల్ల సప్లయర్లు డీమార్ట్‌కు మరిన్ని డిస్కౌంట్లు ఇస్తుంటారు. అందుకే సామాన్యులకు కావాల్సిన నిత్యవసరాల నుండి గృహోపకరణాల వరకు..

DMart Prices: మధ్యతరగతి కుటుంబాలకు ‘సూపర్ మార్కెట్’ అనగానే ముందుగా గుర్తొచ్చే పేరు డీమార్ట్ (DMart). ఒకప్పుడు కిరాణా దుకాణాలు లేదా హోల్‌సేల్ మార్కెట్లకు వెళ్లే సామాన్యులను సైతం తనవైపు తిప్పుకున్న ఈ సంస్థ, ఇతర బ్రాండ్ల కంటే తక్కువ ధరకు వస్తువులను ఎలా అందించగలుగుతోంది? దీని వెనుక ఉన్న వ్యూహాలేంటో ఇప్పుడు చూద్దాం.
1. సొంత బ్రాండ్ ఉత్పత్తుల మాయాజాలం
డీమార్ట్ సక్సెస్‌లో ప్రధాన పాత్ర పోషించేది వారి ‘ప్రైవేట్ లేబుల్స్’ (Private Labels). మార్కెట్లో దొరికే ప్రముఖ బ్రాండ్లతో పాటు డీమార్ట్ తన సొంత బ్రాండ్ పేరుతో పప్పులు, బియ్యం, నూనెలు, స్నాక్స్ మరియు క్లీనింగ్ లిక్విడ్స్‌ను విక్రయిస్తుంది. ఇతర బ్రాండ్లు అడ్వర్టైజ్‌మెంట్ల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తాయి. కానీ డీమార్ట్ తన వస్తువులకు ఎలాంటి ప్రచారం చేయదు. ఈ మిగిలిన ఖర్చును వినియోగదారులకు డిస్కౌంట్ రూపంలో (సుమారు 20% నుండి 40% వరకు) అందిస్తుంది.
2. ‘ప్రీమియం’ బ్రాండ్ పేరుతో దుస్తులు
కేవలం కిరాణా మాత్రమే కాదు, దుస్తుల విభాగంలో కూడా డీమార్ట్ “ప్రీమియం” అనే బ్రాండ్ పేరిట సొంత కలెక్షన్లను ఉంచుతుంది. ఇవి నాణ్యతలో బాగుండటమే కాకుండా, ఇతర బ్రాండెడ్ షోరూమ్‌ల కంటే చాలా తక్కువ ధరకు లభిస్తాయి.
3. బల్క్ పర్చేసింగ్
డీమార్ట్ వస్తువులను తయారీదారుల (Manufacturers) నుండి నేరుగా భారీ మొత్తంలో కొనుగోలు చేస్తుంది. ఇలా పెద్ద మొత్తంలో కొనడం వల్ల వారికి భారీగా డిస్కౌంట్ లభిస్తుంది. ఆ లాభాన్ని వినియోగదారులకు బదిలీ చేయడం ద్వారా ధరలను తగ్గిస్తుంది.
4. తక్కువ నిర్వహణ ఖర్చులు
డీమార్ట్ తన స్టోర్లను ఎక్కువగా నిరాడంబరంగా ఉంచుతుంది. ఖరీదైన డెకరేషన్లు, భారీ హోర్డింగ్‌ల జోలికి వెళ్లదు. అలాగే, చాలా చోట్ల సొంత భవనాలను కలిగి ఉండటం వల్ల అద్దె భారం తగ్గుతుంది. ఈ ఆదా అంతా కస్టమర్ల జేబుకే లాభాన్ని చేకూరుస్తుంది.
5. స్లాట్ ఫీజు, పేమెంట్ సైకిల్
ఇతర కంపెనీల ఉత్పత్తులను తన షెల్ఫ్స్‌లో ఉంచడానికి డీమార్ట్ ‘స్లాట్ ఫీజు’ తీసుకుంటుంది. అలాగే సప్లయర్లకు త్వరగా పేమెంట్స్ చేస్తుంది. దీనివల్ల సప్లయర్లు డీమార్ట్‌కు మరిన్ని డిస్కౌంట్లు ఇస్తుంటారు. అందుకే సామాన్యులకు కావాల్సిన నిత్యవసరాల నుండి గృహోపకరణాల వరకు ‘చీప్ అండ్ బెస్ట్’గా అందించడంలో డీమార్ట్ అగ్రస్థానంలో నిలుస్తోంది. తక్కువ ధర, నాణ్యమైన వస్తువు అనే సూత్రమే డీమార్ట్‌ను దేశంలోనే మోస్ట్ సక్సెస్‌ఫుల్ రిటైల్ చైన్‌గా మార్చింది.
ఇది కూడా చదవండి: Investment Tips: మీరు ఎందులోనైనా పెట్టుబడి పెడుతున్నారా? ముందు ఈ 10 విషయాలు తప్పక తెలుసుకోండి!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




