ఉపాసన కోసం చెఫ్‌గా మారిన అక్కినేని కోడలు…

Samantha Akkineni Turns Chef: అందరూ ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్‌ను ఫాలో అయ్యేందుకు స్ఫూర్తిని అందించాలనే లక్ష్యంతో హీరో రామ్ చరణ్ సతీమణి, అపోలో సంస్థ వైస్ చైర్మన్ ఉపాసన కొణిదెల ‘యూఆర్ లైఫ్’ అనే వెబ్‌సైట్‌ను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. URLife.co.in వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేయడం వెనుక ముఖ్య ఉద్దేశం ప్రకృతి అనుకూలమైన జీవనం, సంపూర్ణ ఆరోగ్యం వంటి కొన్ని ప్రత్యేకమైన సిద్ధాంతాలను ప్రజలకు చేరువయ్యేలా చేయడమేనని ఉపాసన తెలిపారు. ఈ వెబ్‌సైట్‌కు అతిథి సంపాదకురాలిగా […]

ఉపాసన కోసం చెఫ్‌గా మారిన అక్కినేని కోడలు...
Follow us
Ravi Kiran

|

Updated on: Sep 27, 2020 | 2:55 PM

Samantha Akkineni Turns Chef: అందరూ ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్‌ను ఫాలో అయ్యేందుకు స్ఫూర్తిని అందించాలనే లక్ష్యంతో హీరో రామ్ చరణ్ సతీమణి, అపోలో సంస్థ వైస్ చైర్మన్ ఉపాసన కొణిదెల ‘యూఆర్ లైఫ్’ అనే వెబ్‌సైట్‌ను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. URLife.co.in వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేయడం వెనుక ముఖ్య ఉద్దేశం ప్రకృతి అనుకూలమైన జీవనం, సంపూర్ణ ఆరోగ్యం వంటి కొన్ని ప్రత్యేకమైన సిద్ధాంతాలను ప్రజలకు చేరువయ్యేలా చేయడమేనని ఉపాసన తెలిపారు.

ఈ వెబ్‌సైట్‌కు అతిథి సంపాదకురాలిగా స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని పేరును ప్రకటించిన సంగతి విదితమే. ఇందులో భాగంగా సమంత.. ఉపాసనతో కలిసి “తక్కలి సదం” వంటకాన్ని చేసి చూపించారు. ఆ వంటకం రెసిపీ వీడియోలో చూపించారు. వాళ్లిద్దరూ ఎంజాయ్ చేస్తూ కుకింగ్‌లో పాల్గొన్నారు. కాగా, సమంత కూడా ఈ మధ్య “అర్బన్ ఫామింగ్” పేరుతో ఆరోగ్యం మీద ,తినే ఆహారం మీద చాలా శ్రద్ద తీసుకుంటూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

Also Read:

మందుబాబులకు కిక్కిచ్చే వార్త.. ఆన్‌లైన్‌లో మద్యం అమ్మకాలు.!

బ్రూసెల్లోసిస్‌… తస్మాత్ జాగ్రత్త.!

ఏపీలో కొత్త ఎక్సైజ్ పాలసీ.. ఆ ప్రదేశాల్లో లిక్కర్ షాపులకు నో పర్మిషన్..

కరోనాపై ఎస్పీ బాలు చివరి పాట.. ఎంత మధురంగా పాడారంటే.!

సెప్టెంబర్ 25.. టాలీవుడ్ ఇండస్ట్రీకి బ్లాక్ డే..

ఏపీలో తగ్గినట్లే తగ్గి.. మళ్లీ పెరిగిన కరోనా కేసులు..!