నల్గొండ ఎగ్జామ్‌ సెంటర్‌లో నటి హేమ.. ఏ పరీక్ష‌ రాశారంటే

నల్గొండ ఎన్జీ కాలేజీలో నటి హేమ పరీక్ష రాశారు. డిగ్రీ పట్టా పొందేందుకు బీఆర్‌ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అర్హత పరీక్షను ఆమె రాశారు

  • Tv9 Telugu
  • Publish Date - 3:18 pm, Sun, 27 September 20
నల్గొండ ఎగ్జామ్‌ సెంటర్‌లో నటి హేమ.. ఏ పరీక్ష‌ రాశారంటే

Actress Hema exam: నల్గొండ ఎన్జీ కాలేజీలో నటి హేమ పరీక్ష రాశారు. డిగ్రీ పట్టా పొందేందుకు బీఆర్‌ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అర్హత పరీక్షను ఆమె రాశారు. ఆ తరువాత హేమ మాట్లాడుతూ.. ”ఎప్పటి నుంచో డిగ్రీ చేయాలనుంది. హైదరాబాద్‌ అయితే ఇబ్బంది ఉంటుందని ఇక్కడకు వచ్చి పరీక్ష రాశా. ఎవరి కంటా పడకూడదనుకున్నా. అందుకే ఇక్కడ సెంటర్‌ని పెట్టుకున్నా” అని  అన్నారు. ”ఫిలిం సిటీలో షూటింగ్‌లో పాల్గొంటున్నాను, నల్గొండ ఫిల్మ్‌ సిటీకి దగ్గరగా ఉండటం, హైదరాబాద్‌లో కోవిడ్ కేసులు, ట్రాఫిక్ ఇబ్బందులు, ఎవరైనా గుర్తు పడితే ప్రశాంతంగా ఉండదని పరీక్ష రాసేందుకు నల్గొండ వచ్చాను. ఈ ప్రాంతంలో తమకు బంధువులు కూడా ఉన్నారని” ఆమె అన్నారు. అయితే విద్యార్హతలు సంపాదించేందుకు వయస్సుతో సంబంధం లేదు అని ఇప్పటికే పలువురు నిరూపించగా.. హేమ కూడా తాజాగా ఆ కోవలో చేరారు.

Read More:

కడప జిల్లాలో అంతర్రాష్ట్ర దోపిడీ గ్యాంగ్ కలకలం

నా తమ్ముడిని చివరిసారిగా చూడలేకపోయా: యేసుదాసు భావోద్వేగ వ్యాఖ్యలు