AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అక్కడ జూన్ 1 నుంచి తెరుచుకోనున్న గుళ్లు, మసీదులు..!

పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ జూన్‌ నుంచి దశల వారిగా సడలింపులు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వలస కార్మికుల వల్ల రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. జూన్‌ 1 నుండి మతపరమైన ప్రదేశాలు తెరవవచ్చని వెల్లడించారు. ఇక ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాలకు పూర్తి స్థాయిలో ఉద్యోగుల హాజరు కావాలని ఆమె ప్రకటించారు. గత కొద్ది రోజులుగా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తోంది మమతా బెనర్జీ. […]

అక్కడ జూన్ 1 నుంచి తెరుచుకోనున్న గుళ్లు, మసీదులు..!
Balaraju Goud
|

Updated on: May 29, 2020 | 6:25 PM

Share

పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ జూన్‌ నుంచి దశల వారిగా సడలింపులు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వలస కార్మికుల వల్ల రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. జూన్‌ 1 నుండి మతపరమైన ప్రదేశాలు తెరవవచ్చని వెల్లడించారు. ఇక ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాలకు పూర్తి స్థాయిలో ఉద్యోగుల హాజరు కావాలని ఆమె ప్రకటించారు. గత కొద్ది రోజులుగా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తోంది మమతా బెనర్జీ. తన ప్రభుత్వాన్ని సంప్రదించకుండా రైళ్ల ద్వారా పెద్ద సంఖ్యలో వలస కార్మికులను రాష్ట్రానికి తీసుకువచ్చారని మండిపడ్డారు. సామాజిక దూరం వంటి కరోనా నిబంధనలను పాటించకుండానే ఇది జరుగుతోందన్నారు. శ్రామిక్‌ స్పెషల్‌ రైళ్లకు బదులుగా రైల్వేలు కరోనా ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను నడుపుతున్నాయంటూ మండిపడ్డారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వలస కార్మికులకు ఎక్కువ సంఖ్యలో శ్రామిక్ రైళ్లను నడపాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు మమతా. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు సడలింపు తప్పవని మమతా స్పష్టం చేశారు.