డ్రోన్లతో కార్గో సేవలు.. డీజీసీఏ అనుమతి.. స్పైస్‌జెట్‌ ట్రయల్స్‌..!

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలమయ్యాయి. ఈ క్రమంలో ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌ జెట్‌ డ్రోన్లతో కార్గో సేవలకు సిద్ధమైంది.

డ్రోన్లతో కార్గో సేవలు.. డీజీసీఏ అనుమతి.. స్పైస్‌జెట్‌ ట్రయల్స్‌..!
Follow us

| Edited By:

Updated on: May 29, 2020 | 6:50 PM

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలమయ్యాయి. ఈ క్రమంలో ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌ జెట్‌ డ్రోన్లతో కార్గో సేవలకు సిద్ధమైంది. డ్రోన్లను ఉపయోగించి ఆరోగ్య, ఈ-కామర్స్‌ ఉత్పత్తులను చేరవేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. దీనిలో భాగంగా ట్రయల్స్‌ నిర్వహించేందుకు తాజాగా డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) అనుమతి ఇచ్చిందని స్పైస్‌జెట్‌ ప్రకటించింది.

కాగా.. ట్రయల్స్‌ అనంతరం అత్యవసర ఆరోగ్య పార్సిళ్లు, త్వరగా పాడయ్యే వస్తువుల సరఫరా సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని ప్రకటించింది. అయితే డ్రోన్లతో డెలివరీ ప్రయోగాలకు డీజీసీఏ ఇప్పటికే 13 సంస్థలకు అనుమతి ఇచ్చింది. ‘భారత్‌లో అందుబాటు ధరలతో పాటు సుదీర్ఘ ప్రాంతాలకు డ్రోన్ల ద్వారా అత్యవసర వస్తువులను చేరవేయడంలో ఇది మరో ముందడుగు’ అని స్పైస్‌జెట్‌ ఛైర్మన్‌, ఎండీ అజయ్‌ సింగ్‌ వెల్లడించారు.

మరోవైపు.. భారత్‌లో లాక్‌డౌన్‌ కారణాంగా వస్తువుల హోం డెలివరీతో పాటు ఆహార సరఫరాకు భారీ డిమాండ్‌ ఏర్పడింది. తాజాగా నిబంధనలు సడలించడంతో ప్రస్తుతం హోం డెలివరీ సేవలు ఊపందుకున్నాయి. దీనికి మరింత డిమాండ్‌ పెరగడంతో దాదాపు 50వేల మంది డోర్‌ డెలివరీ వర్కర్లను తాత్కాలికంగా నియమించుకుంటామని అమెజాన్‌ వెల్లడించిన విషయం విదితమే.