AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గ్రేటర్‌లో కరోనా సర్వే.. రంగంలోకి ఐసీఎమ్ఆర్

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనా కేసులపై భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎమ్ఆర్) సర్వెలైన్స్‌ రెండు రోజుల పాటు సర్వే నిర్వహించనుంది. గ్రేటర్ పరిధిలోని 5 కంటైన్మెంట్ జోన్లలో శని, ఆదివారాల్లో ఎన్ఐఎన్ టీమ్స్ ఈ సర్వే నిర్వహించనున్నాయి.నివేదిక ఆధారంగా లాక్‌డౌన్ పొడిగింపుపై..

గ్రేటర్‌లో కరోనా సర్వే.. రంగంలోకి ఐసీఎమ్ఆర్
Jyothi Gadda
|

Updated on: May 29, 2020 | 6:25 PM

Share

తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది.. గత రెండు రోజులుగా వందకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇక రాష్ట్రంలో నమోదవుతున్న కరోనా కేసుల్లో అత్యధికం హైదరాబాద్‌లోనే నమోదు కావటం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనా కేసులపై భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎమ్ఆర్) సర్వెలైన్స్‌ శనివారం నుంచి రెండు రోజుల పాటు సర్వే నిర్వహించనుంది. శని, ఆదివారాల్లో ఎన్ఐఎన్ టీమ్స్ ఈ సర్వే నిర్వహించనున్నాయి. హైదరాబాద్‌లోని 5 కంటైన్మెంట్‌ జోన్లలో రెండు రోజుల పాటు జాతీయ పౌష్టికాహార సంస్థ (ఎన్ఐఎన్) టీమ్స్ ఈ సర్వే నిర్వహించనున్నాయి.

గ్రేటర్ పరిధిలోని 5 కంటైన్మెంట్ జోన్లు.. ఆదిభట్ల, బాలాపూర్, మియాపూర్, చందానగర్, టప్పాచబుత్రలో రెండు రోజుల పాటు అధికారులు సర్వే చేయనున్నారు. ఈ ఐదు కంటైన్మెంట్‌ జోన్లలో కరోనా కేసులు, వాటి పరిస్థితి, లక్షణాలపై ఇంటింటా సర్వే నిర్వహిస్తారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే ప్రతి జోన్‌కు 2 చొప్పున 10 ప్రత్యేక టీమ్‌ల ద్వారా సర్వేకు ఏర్పాట్లు పూర్తి చేశారు. గతంలో తెలంగాణలోని జనగామ, కామారెడ్డి, నల్గొండ జిల్లాల్లో ఇప్పటికే సర్వే జరిపారు.

ICMR నివేదికల ఆధారంగానే లాక్‌డౌన్‌ పొడిగింపుపై కేంద్రం నిర్ణయం తీసుకుంటూ వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో సర్వే చేపట్టారు. హైదరాబాద్‌లో పెరుగుతున్న కేసులు, లక్షణాలు లేనటువంటి కేసులపై ఐసీఎంఆర్‌ పూర్తిస్థాయి నివేదిక తయారుచేయనుంది. ఆ నివేదికను కేంద్ర వైద్యఆరోగ్యశాఖకు సమర్పిస్తారు. నివేదిక ఆధారంగానే లాక్‌డౌన్ పొడిగింపుపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. మే 31తో లాక్‌డౌన్ 4 ముగియనున్న సంగతి తెలిసిందే.

Follow Us
ప్రతి 12 ఏళ్లకోసారి ఆలయాల్లో కుంభాభిషేకం ఎందుకు చేస్తారు? దీని..
ప్రతి 12 ఏళ్లకోసారి ఆలయాల్లో కుంభాభిషేకం ఎందుకు చేస్తారు? దీని..
ఒకప్పుడు జేసీబీ డ్రైవర్.. ఇప్పుడు జబర్దస్త్‌లో అదరగొడుతున్నాడు
ఒకప్పుడు జేసీబీ డ్రైవర్.. ఇప్పుడు జబర్దస్త్‌లో అదరగొడుతున్నాడు
ఉద్యోగుల్లో అధికంగా సంతానలేమి.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
ఉద్యోగుల్లో అధికంగా సంతానలేమి.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
తెలంగాణ పోలీస్‌శాఖ కీలక నిర్ణయం
తెలంగాణ పోలీస్‌శాఖ కీలక నిర్ణయం
వర్షాకాలంలో ఫ్రిజ్‌లో ఒక గిన్నెడు ఉప్పు ఎందుకు పెట్టాలో తెలుసా?
వర్షాకాలంలో ఫ్రిజ్‌లో ఒక గిన్నెడు ఉప్పు ఎందుకు పెట్టాలో తెలుసా?
ఒక్కరోజులోనే మొటిమలు మాయం.. ఇంట్లోనే సింపుల్‌గా ఇలా చేస్తే చాలు..
ఒక్కరోజులోనే మొటిమలు మాయం.. ఇంట్లోనే సింపుల్‌గా ఇలా చేస్తే చాలు..
వివాహానికి రాహువు అడ్డంకిగా మారుతున్నాడా? ఈ జ్యోతిష్య పరిహారాలతో
వివాహానికి రాహువు అడ్డంకిగా మారుతున్నాడా? ఈ జ్యోతిష్య పరిహారాలతో
డీఎస్పీ భీమ్‌రెడ్డి అక్రమాస్తుల కేసు: ఏసీబీ దాడుల్లో భారీ ఆస్తులు
డీఎస్పీ భీమ్‌రెడ్డి అక్రమాస్తుల కేసు: ఏసీబీ దాడుల్లో భారీ ఆస్తులు
పీఎఫ్ విత్ డ్రా కొత్త రూల్స్.. ఏడాదికి రెండుసార్లు మాత్రమే..
పీఎఫ్ విత్ డ్రా కొత్త రూల్స్.. ఏడాదికి రెండుసార్లు మాత్రమే..
50 ఏళ్ల వయసులో ప్రియురాలిని పెళ్లాడిన ప్రముఖ నటుడు.. ఫొటోస్ వైరల్
50 ఏళ్ల వయసులో ప్రియురాలిని పెళ్లాడిన ప్రముఖ నటుడు.. ఫొటోస్ వైరల్