Tokyo Olympics: ఒలింపిక్స్‌లో తొలి ట్రాన్స్‌జెండర్..! లారెన్ హబ్బర్డ్ ఎంపిక పట్ల వివాదం?
టోక్యోలో జులై లో జరిగే ఒలింపిక్స్ క్రీడలకు ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. ఈ మేరకు పలు దేశాలకు చెందిన టీంలు టోక్యో చేరుకుంటున్నాయి. తాజాగా టోక్యో ఒలింపిక్స్‌కు తొలిసారిగా ఓ ట్రాన్స్‌జెండర్‌ను ఎంపిక చేయడంతో వివాదం చెలరేగుతోంది.
Tokyo Olympics: టోక్యోలో జులై లో జరిగే ఒలింపిక్స్ క్రీడలకు ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. ఈ మేరకు పలు దేశాలకు చెందిన టీంలు టోక్యో చేరుకుంటున్నాయి. తాజాగా టోక్యో ఒలింపిక్స్‌కు తొలిసారిగా ఓ ట్రాన్స్‌జెండర్‌ను ఎంపిక చేయడంతో వివాదం చెలరేగుతోంది. న్యూజిలాండ్‌కు చెందిన లారెల్ హబ్బర్డ్.. టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనబోతోంది. ఒలింపిక్స్‌కు ఎంపికైన తొలి ట్రాన్స్‌జెండర్ గా రికార్డుల్లోకి ఎక్కనుంది. కివీస్ మహిళల వెయిట్ లిఫ్టింగ్ జట్టు కోసం లారెల్ హబ్బర్డ్ ను ఎంపిక చేశారు. ట్రాన్స్‌జెండర్‌గా మారకముందు 2013లో మెన్స్ ఈవెంట్స్‌లో పాల్గొంది. అయితే, హబ్బర్డ్ ఎంపిక పట్ల పలు వర్గాలనుంచి ఆరోపణలు వస్తున్నాయి. ఇలా మహిళల విభాగంలో పోటీ చేయడంతో.. ఆమెకే ఎక్కువ అవకాశాలుంటాయని పలువురు ఆరోపిస్తున్నారు. హబ్బర్ట్ను పోటీలకు ఎంపికచేయడం సిల్లీగా ఉందని కొందరంటే… మరికొందరు మాత్రం గేమ్స్‌లో ట్రాన్స్‌జెండర్ల సంఖ్యను పెంచాలని గళం విప్పుతున్నారు. ఒలింపిక్స్‌కు ఎంపిక కావడం పట్ల.. న్యూజిలాండ్ ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటానని లారెల్ హబ్బర్డ్ పేర్కొంది. మహిళల 87 కిలోల వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో హబ్బర్డ్ పోటీ చేయనుంది.
కాగా, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ 2015లో కొన్ని రూల్స్ మార్చింది. వీటి ప్రకారం ట్రాన్స్‌జెండర్ అథ్లెట్లు మహిళల కేటగిరీలో పోటీ చేసేందుకు అర్హులేనని పేర్కొంది. అయితే, ట్రాన్స్‌జెండర్ అథ్లెట్లు.. తాను మహిళనేనన్న అంగీకార పత్రం అందించాలని తెలిపింది. అలాగే పోటీల్లో పాల్గొనే ముందునుంచి ఏడాది వరకు టెస్టోస్టెరాన్ లెవల్స్ ఐఓసీ రూల్స్‌కు అనుగుణంగా ఉండాలని వెల్లడించింది. ఈ రూల్స్ మేరకు లారెల్ హబ్బర్డ్‌కు ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు అనుమతి వచ్చింది.
లారెల్ హబ్బర్డ్ అసలు పేరు గెవిన్ హబ్బర్డ్. ట్రాన్స్‌జెండర్ గా మారక ముందు జూనియర్ స్థాయి పోటీల్లో పాల్గొని పలు జాతీయ రికార్డులు నెలకొల్పాడు. అనంతరం ట్రాన్స్‌జెండర్‌గా మారి 2017లో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొని రజత పతకం గెలిచింది. వీటితోపాటు 2019 పసిఫిక్ గేమ్స్‌లో బంగారు పతకాన్ని గెలుచుకుంది. అలాగే 2018 కామన్వెల్త్ పోటీల్లో పాల్గొంది.. కానీ, గాయంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. మొత్తానికి ఒలింపిక్స్‌కు ఎంపికైన తొలి ట్రాన్స్‌జెండర్‌గా రికార్డుల్లోకి ఎక్కింది లారెల్ హబ్బర్డ్.
Also Read: