తెలంగాణలో వర్షాలు కురిసే ప్రాంతాలు ఇవే…
ఈసారి నైరుతి రుతుపవనాలు సరైన సమయానికే రాష్ట్రంలో ప్రవేశించాయి. ప్రస్తుతం తెలంగాణలో నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. దీంతో గత 15 రోజులుగా తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి...
Weather Report Tomorrow in Telangana : ఈసారి నైరుతి రుతుపవనాలు సరైన సమయానికే రాష్ట్రంలో ప్రవేశించాయి. ప్రస్తుతం తెలంగాణలో నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. దీంతో గత 15 రోజులుగా తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. అయితే తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడురోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
తూర్పు.. ఉత్తర ప్రదేశ్ నుండి దక్షిణ ఒరిస్సా వరకు చత్తీస్ గఢ్ మీదుగా 4.5 కిలోమీటర్ల ఎత్తు వద్ద ఉత్తర-దక్షిణ ఉపరితల ద్రోణి ఏర్పడిందని ప్రకటించారు. ఈ ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఈరోజు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది.
ఈరోజు ఆదిలాబాద్, కోమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్-పట్టణ, వరంగల్-గ్రామీణ, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం మరియు ఖమ్మం జిల్లాలలో ఒకటి రెండు చోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది.