తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరికలు
గత ఐదురోజులుగా సాయంత్రం సమయంలో కురుస్తున్న భారీ వర్షాలతో హైదరాబాద్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పగలు మధ్యాహ్నం వరకు ఎండగా ఉంటూ.. సాయంత్రానికి పెద్ద పెద్ద ఉరుములతో కురుస్తున్న భారీ వర్షంలో ప్రజలు తీవ్ర భయందోళనకు గురవుతున్నారు. బుధవారం కూడా భారీ వర్షం కురవడంతో నగరంలో ఎక్కడి ట్రాఫిక్ అక్కడే ఆగిపోయింది. ఇదిలా ఉంటే మంగళవారం సాయంత్రం కురిసిన భారీ వర్షంతోపాటు భారీ పిడుగు కూడా పడింది. ఛాదర్‌ఘాట్ ప్రాంతంలోని ఓల్డ్ మలక్‌పేట రేస్‌కోర్టు సమీపంలో […]
గత ఐదురోజులుగా సాయంత్రం సమయంలో కురుస్తున్న భారీ వర్షాలతో హైదరాబాద్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పగలు మధ్యాహ్నం వరకు ఎండగా ఉంటూ.. సాయంత్రానికి పెద్ద పెద్ద ఉరుములతో కురుస్తున్న భారీ వర్షంలో ప్రజలు తీవ్ర భయందోళనకు గురవుతున్నారు. బుధవారం కూడా భారీ వర్షం కురవడంతో నగరంలో ఎక్కడి ట్రాఫిక్ అక్కడే ఆగిపోయింది. ఇదిలా ఉంటే మంగళవారం సాయంత్రం కురిసిన భారీ వర్షంతోపాటు భారీ పిడుగు కూడా పడింది. ఛాదర్‌ఘాట్ ప్రాంతంలోని ఓల్డ్ మలక్‌పేట రేస్‌కోర్టు సమీపంలో ఓ ఇంటిపై పిడుగు పడటంతో ఇంటి గోడలు బీటలు వారాయి. భారీ శబ్దం రావడంతో ఇంట్లో నివసిస్తున్నవారు బయటకు పరుగులు తీశారు.
మరోవైపు ఉపరితల ఆవర్తన ప్రభావం కారణంగా ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్టు ఢిల్లీలోని కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీని ప్రభావంతో ఏపీ సరిహద్దు రాష్ట్రం ఒడిషా, అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ రాష్ట్రాల్లోకూడా బుధవారం అతిభారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తాజా బులిటిన్‌లో వెల్లడించారు. ఇదిలా ఉంటే పలు ఛత్తీస్‌గడ్‌తో పాటు పశ్చిమబెంగాల్, సిక్కిం, ఒడిషా రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశాలు కూడా ఉన్నాయని వాతావరణ అధికారులు హెచ్చరించారు.