పులిపంజా నుంచి తప్పించుకున్న బుడతడు!

పెద్దపులి పంజా విసిరిందంటే ఎవరూ తప్పించుకోలేరు. కానీ, ఓ ఏడేళ్ల బుడతడు మాత్రం పులి నోటిదాకా వెళ్లి నవ్వుతూ వచ్చాడు. వివరాల్లోకి వెళితే.. షాన్ కాస్టెల్లో అనే ఐర్లాండ్‌కు చెందిన ఏడేళ్ల చిన్నోడు అతని తండ్రితో కలిసి సరదాగా జంతువులను చూడాలని దుబ్లిన్‌ జూకు వెళ్లాడు. అక్కడున్న జంతువులను చూస్తూ ఆనందంతో చిరునవ్వులు చిందించాడు. అంతేకాదు, వాటితో సెల్ఫీలు కూడా దిగుతూ తెగ ఎంజాయ్‌ చేశాడు. అంతలోనే ఓ చోట బాలుడు ఫోటోలు దిగుతుండగా దూరం నుంచి […]

  • Tv9 Telugu
  • Publish Date - 7:01 pm, Fri, 27 December 19
పులిపంజా నుంచి తప్పించుకున్న బుడతడు!

పెద్దపులి పంజా విసిరిందంటే ఎవరూ తప్పించుకోలేరు. కానీ, ఓ ఏడేళ్ల బుడతడు మాత్రం పులి నోటిదాకా వెళ్లి నవ్వుతూ వచ్చాడు. వివరాల్లోకి వెళితే.. షాన్ కాస్టెల్లో అనే ఐర్లాండ్‌కు చెందిన ఏడేళ్ల చిన్నోడు అతని తండ్రితో కలిసి సరదాగా జంతువులను చూడాలని దుబ్లిన్‌ జూకు వెళ్లాడు. అక్కడున్న జంతువులను చూస్తూ ఆనందంతో చిరునవ్వులు చిందించాడు. అంతేకాదు, వాటితో సెల్ఫీలు కూడా దిగుతూ తెగ ఎంజాయ్‌ చేశాడు.

అంతలోనే ఓ చోట బాలుడు ఫోటోలు దిగుతుండగా దూరం నుంచి చూసింది ఓ పెద్దపులి. అంతే అమాంతం వచ్చి బాలుడి మీద పడి గొంతుపట్టేసింది. ఇంతలోనే బాలుడు ఎంచక్కా నవ్వుతూ పులి పంజా నుంచి తప్పించుకు వెళ్లిపోయాడు. పైగా ఇదంతా పిల్లవాడి తండ్రి దగ్గరుండి వీడియో తీశాడు. ఆ వీడియోను సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేయటంతో నెటింట్లో ఇప్పుడది వైరల్‌గా మారింది.

ఇంతకీ బాలుడు పులి పంజా నుంచి ఎలా తప్పించుకున్నాడో చెప్పనే లేదు కదా.. పిల్లవాడికి, పులికి మధ్యలో ఓ మందమైన గ్లాస్ ఉంది. దీంతో చిన్నోడికి ఎటువంటి గాయం కాలేదు. పైగా ఆ పులి తనపై పంజావిసరడానికి ప్రయత్నిస్తుంటే కాస్టెల్లో మాత్రం చిరునవ్వులు చిందిస్తూ కెమెరాకు ఫోజిచ్చాడు. ఆ వీడియోని మీరు చూడండి.