2019లో మోస్ట్ డేంజరస్ పొల్యూటెడ్ ఏరియాస్ ఇవే!

ప్రపంచ వ్యాప్తంగా వాయు కాలుష్యం ఒక పెద్ద సమస్యగా మారింది. పొల్యూషన్‌తో ఏటా చాలా మంది ప్రాణాలను విడుస్తున్నారు. గత కొద్దిరోజుల క్రితం ఢిల్లీలో తీవ్రస్థాయిలో పొల్యూషన్ పెరిగిపోయింది. పొల్యూషన్‌ ఎఫెక్ట్‌తో ఏకంగా అక్కడి ప్రజలు ఆక్సిజన్‌ను కొనుక్కొని మరీ ఊపిరి పీల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి ప్రధాన కారణం భూతాపం పెరగడమైతే.. వాహనాల సంఖ్య పెరిగిపోవడం మరో కారణంగా చెప్పవచ్చు. అందుకే దీనిపై ఇటీవల ఐక్యరాజ్య సమితి 2019 సంవత్సరానికి బీట్ ఏర్ పొల్యూషన్ (వాయు […]

2019లో మోస్ట్ డేంజరస్ పొల్యూటెడ్ ఏరియాస్ ఇవే!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Dec 27, 2019 | 6:48 PM

ప్రపంచ వ్యాప్తంగా వాయు కాలుష్యం ఒక పెద్ద సమస్యగా మారింది. పొల్యూషన్‌తో ఏటా చాలా మంది ప్రాణాలను విడుస్తున్నారు. గత కొద్దిరోజుల క్రితం ఢిల్లీలో తీవ్రస్థాయిలో పొల్యూషన్ పెరిగిపోయింది. పొల్యూషన్‌ ఎఫెక్ట్‌తో ఏకంగా అక్కడి ప్రజలు ఆక్సిజన్‌ను కొనుక్కొని మరీ ఊపిరి పీల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి ప్రధాన కారణం భూతాపం పెరగడమైతే.. వాహనాల సంఖ్య పెరిగిపోవడం మరో కారణంగా చెప్పవచ్చు. అందుకే దీనిపై ఇటీవల ఐక్యరాజ్య సమితి 2019 సంవత్సరానికి బీట్ ఏర్ పొల్యూషన్ (వాయు కాలుష్యాన్ని) నిర్మూలిద్దామనే ప్రచారానికి అన్ని దేశాలకు పిలుపు నిచ్చింది.

ఇందులో భాగంగా చెట్లను పెంచాలని సలహా కూడా ఇచ్చారు. పొల్యూషన్‌ భారిన పడకుండా ఉండాలంటే ఇదే మార్గమని కూడా సూచించారు. ఈ వాయు కాలుష్యం కారణంగా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 70 లక్షల మంది అకాల మరణం చెందారని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ ఎయిర్ పొల్యూషన్‌తో శ్వాసకోశ వ్యాధులు వస్తున్నట్లు వారు పేర్కొన్నారు. గుండెపోటు, డయాబెటీస్, ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో పాటుగా దీర్షకాలిక శ్వాసకోశ వ్యాధులు వస్తున్నట్లు నిపుణులు ఇప్పటికే ప్రభుత్వాలని కూడా హెచ్చరించారు.

2019: ప్రపంచవ్యాప్తంగా డేంజరస్‌లో ఉన్న నగరాల లిస్ట్ ఇదే!

1) Accra, Ghana : 97.25% 2) Tetovo, Macedonia : 96.37% 3) Kathmandu, Nepal : 95.66% 4) Kabul, Afghanistan : 95.59% 5) Ulaanbaatar, Mongolia : 95.27% 6) Ghaziabad, India : 94.46% 7) Dhaka, Bangladesh : 93.56% 8) Cairo, Egypt : 93.27% 9) Noida, India : 93.01%