15 సినిమాలు.. రూ.100 కోట్లు.. ఒక్క సల్మాన్‌కే ఇది సాధ్యం.!
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ ఇవాళ తన 54 ఏటలోకి అడుగుపెట్టాడు. ఈ రోజు అతడి పుట్టినరోజు కావడంతో బీ-టౌన్ సెలబ్రిటీస్, ఫ్యాన్స్ నుంచి విషెస్ సోషల్ మీడియా వేదికగా వెల్లువెత్తాయి. ఇదిలా ఉంటే సల్లూభాయ్ బర్త్‌డే రోజున ఓ రేర్ ఫీట్ అందుకోవడం విశేషం. తాజాగా విడుదలైన ‘దబాంగ్ 3’ సినిమాతో ఈ రికార్డును సొంతం చేసుకున్న సల్మాన్.. బాక్స్ ఆఫీస్ బాద్షా తానేనంటూ మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. అదేంటో ఇప్పుడు చూద్దాం.. బాలీవుడ్‌లో వంద కోట్ల […]

బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ ఇవాళ తన 54 ఏటలోకి అడుగుపెట్టాడు. ఈ రోజు అతడి పుట్టినరోజు కావడంతో బీ-టౌన్ సెలబ్రిటీస్, ఫ్యాన్స్ నుంచి విషెస్ సోషల్ మీడియా వేదికగా వెల్లువెత్తాయి. ఇదిలా ఉంటే సల్లూభాయ్ బర్త్‌డే రోజున ఓ రేర్ ఫీట్ అందుకోవడం విశేషం. తాజాగా విడుదలైన ‘దబాంగ్ 3’ సినిమాతో ఈ రికార్డును సొంతం చేసుకున్న సల్మాన్.. బాక్స్ ఆఫీస్ బాద్షా తానేనంటూ మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. అదేంటో ఇప్పుడు చూద్దాం..
బాలీవుడ్‌లో వంద కోట్ల క్లబ్‌లో చేరిన సినిమాల్లో ఒక్క సల్మాన్ ఖాన్‌వే 15 ఉండటం విశేషం. టాక్‌తో సంబంధం లేకుండా అతడి సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ అదరగొట్టాయి. 2017లో విడుదలైన ‘టైగర్ జిందా హై’ దాదాపు రూ.339 కోట్లు కలెక్ట్ చేసి భాయ్ సినిమాల్లో మొదటి వరుసలో నిలిచింది.
భజ్‌రంగి భాయ్‌జాన్, సుల్తాన్, కిక్, భారత్, ప్రేమ్ రతన్ ధన్ పాయో, ఏక్ థా టైగర్, రేస్ 3, దబాంగ్ 2, బాడీగార్డ్, దబాంగ్, రెడీ, ట్యూబ్‌లైట్, జైహో, దబాంగ్ 3 ఇలా పలు సినిమాలు వంద కోట్లు క్లబ్‌లో చేరాయి. ఇక సల్మాన్ తర్వాత అక్షయ్ కుమార్ 14 సినిమాలతో రెండో స్థానంలో ఉండగా.. ఆ తర్వాత షారుక్ ఖాన్(7), అమీర్ ఖాన్(6), హృతిక్ రోషన్, అజయ్ దేవగణ్, రణ్‌వీర్ సింగ్, రణబీర్ కపూర్‌లు ఉన్నారు.