అంతా పోలీసులే చేశారు.. హజీపూర్ కిల్లర్ సంచలన ఆరోపణలు!
హాజీపూర్ సీరియల్ కిల్లర్ శ్రీనివాసరెడ్డిపై ఫోక్స్ స్పెషల్ కోర్టులో జరుగుతోన్న విచారణ గురువారం ముగిసిన సంగతి తెలిసిందే. 29 మంది సాక్షుల వాంగ్మూలాన్ని నిందితుడికి న్యాయమూర్తి వినిపించారు. ఈ సందర్భంగా ఆయన శ్రీనివాసరెడ్డిని కొన్ని ప్రశ్నలు అడగ్గా.. అతని దగ్గర నుంచి లేదు, కాదు, తెలియదు అనే సమాధానాలు రావడంతో తదుపరి విచారణను జనవరి 3కు వాయిదా వేశారు. కోర్టు విచారణలో భాగంగా పోర్న్ వీడియోలు చూస్తావా అంటూ జడ్జి ప్రశ్న అడగ్గా.. తన దగ్గర ఆండ్రాయిడ్ […]
హాజీపూర్ సీరియల్ కిల్లర్ శ్రీనివాసరెడ్డిపై ఫోక్స్ స్పెషల్ కోర్టులో జరుగుతోన్న విచారణ గురువారం ముగిసిన సంగతి తెలిసిందే. 29 మంది సాక్షుల వాంగ్మూలాన్ని నిందితుడికి న్యాయమూర్తి వినిపించారు. ఈ సందర్భంగా ఆయన శ్రీనివాసరెడ్డిని కొన్ని ప్రశ్నలు అడగ్గా.. అతని దగ్గర నుంచి లేదు, కాదు, తెలియదు అనే సమాధానాలు రావడంతో తదుపరి విచారణను జనవరి 3కు వాయిదా వేశారు.
కోర్టు విచారణలో భాగంగా పోర్న్ వీడియోలు చూస్తావా అంటూ జడ్జి ప్రశ్న అడగ్గా.. తన దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్ లేదని నిందితుడు జవాబిచ్చాడు. కర్నూలు సువర్ణ హత్యతో నీకు ఏమైనా సంబంధం ఉందా అని ప్రశ్నించగా.. అసలు సువర్ణ ఎవరో తనకు తెలియదని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నాడు. మరి బాలికల దుస్తులపై ఉన్న స్పెర్మ్, రక్తపు మరకలు నీవే అని తేలింది.. దానికి నీ సమాధానం ఏంటని న్యాయమూర్తి అడగ్గా.. సిరంజితో పోలీసులే దుస్తులపై వాటిని చల్లారని నిందితుడు చెప్పినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా హత్య జరిగిన రోజున తన ఫోన్‌ను స్విచ్ఛాఫ్ చేసుకున్నానని.. అందువల్లే టవర్ లొకేషన్ ఆ ప్రాంతంలో చూపించిందని శ్రీనివాసరెడ్డి వెల్లడించాడు. కాగా, ఈ కేసులో సాక్షులుగా తన అమ్మ, నాన్న, అన్నలను తీసుకురావాలని నిందితుడు కోర్టును కోరినట్లు తెలుస్తోంది.