సోమిరెడ్డి-కాకాని మధ్య మాటల యుద్ధం

నెల్లూరు జిల్లాలో రాజకీయం వేడెక్కింది. సోమిరెడ్డి-కాకాని మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గు మనేంతలా వైరం పెరిగింది. తాజాగా సోమిరెడ్డికి సంబంధించిన ఓ వీడియో....

సోమిరెడ్డి-కాకాని మధ్య మాటల యుద్ధం
Sanjay Kasula

|

Oct 29, 2020 | 9:09 PM

War of Words Between Somireddy-Kakani : నెల్లూరు జిల్లాలో రాజకీయం వేడెక్కింది. సోమిరెడ్డి-కాకాని మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గు మనేంతలా వైరం పెరిగింది. తాజాగా సోమిరెడ్డికి సంబంధించిన ఓ వీడియో..వీరిద్దరి మధ్య మరోమారు మాటల యుద్దానికి కారణమైంది.

సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అవినీతి నాయకుడు అంటూ కొన్ని గ్రామాల్లో ఫ్లెక్సీలతో ఊరేగింపు జరిగింది. ఈ వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. దాంతో పాటు సోమిరెడ్డికి ఫారెన్‌ కంట్రీస్‌లో వేల కోట్ల ఆస్తులు ఉన్నాయంటూ కాకాని బహిరంగంగా ఆరోపణలు చేశారు. ఇప్పుడివే ఆరోపణలు కాకరేపుతున్నాయి. దీనిపై స్పందించిన సోమిరెడ్డి…తానకు విదేశాల్లో ఎలాంటి ఆస్తులు లేవన్నారు. కావాలంటే సింగపూర్‌కూ అందరికి తానే టికెట్లు బుక్‌ చేస్తానని…దమ్ముంటే తన ఆస్తులు నిరూపించాలని కాకానికి సవాల్‌ విసిరారు.

సోమిరెడ్డి సవాల్‌పై వ్యంగ్యంగా స్పందించారు ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్‌ రెడ్డి. దమ్ముంటే సోమిరెడ్డి అవినీతి చేయలేదని నిరూపించుకోవలని సవాల్‌ విసిరారు. సింగపూర్‌ వరకు అవసరం లేదని…చిత్తూరు జిల్లాలోని కాణిపాకం, నెల్లూరు జిల్లాలోని గోలగమూడికి వచ్చి ప్రమాణం చేయాలన్నారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu