రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి.. ఎలాగంటారా.. తెలిస్తే మీరు కూడా.!
ఇప్పుడున్న పరిస్థితుల బట్టి.. అప్పులు ఎక్కువ అవుతున్నా.. కచ్చితంగా సేవింగ్స్ మాత్రం చేయాల్సి వస్తుంది. చిన్నదైనా.. కొద్ది కొద్దిగా సేవింగ్స్ మొదలు పెట్టాల్సిందే. మరి ఎందులో పెట్టాలి.? స్టాక్స్, ఫండ్స్.. గోల్డ్, సిల్వర్ ఇలా ఆప్షన్స్ చాలానే ఉన్నాయి. వాటిల్లో ఏది బెస్ట్.?

స్టాక్ మార్కెట్ అనేది ఎప్పుడూ లాటరీ లాంటిదని అందరూ భావిస్తారు. కానీ అది తప్పు.! మంచి ఫండమెంటల్స్, గ్రోత్, ఆదాయం, లాభాలు ఉన్న బెస్ట్ కంపెనీలలో మనం ఇన్వెస్ట్ చేశామంటే.. కచ్చితంగా అది అధిక రాబడి తెచ్చిపెడుతుంది. ఇలాంటి సందర్భాలు గతంలోనే కాదు.. ఇప్పుడు కూడా ఉన్నాయి. సరిగ్గా అలాంటి ఓ స్టాక్ గురించి మాట్లాడేసుకుందాం.
దీని పేరు Waaree Renewables.. ఎప్పుడూ స్థాపించబడిన పూరాతన కంపెనీ ఇది. Waaree గ్రూప్‌కు చెందిన ఈ కంపెనీ ప్రస్తుత మార్కెట్ క్యాప్ సుమారుగా రూ. 10 వేల కోట్లు ఉంటుంది. బుక్ వాల్యూ కూడా రూ. 63గా ఉంది. అయితే ఈ సంస్థ షేర్ 2020 వరకు రూ. 1గా ఉంది. ఆ సమయంలో రూ. 10 వేలు ఇందులో పెట్టుబడి పెట్టినట్లయితే.. మీకు సుమారుగా రూ. 10 వేల షేర్స్ వస్తాయి. ఇక ఇప్పుడు ఈ షేర్ వాల్యూ రూ. 966గా ఉంది. అలాగే 2024 ఏప్రిల్‌లో రూ. 2748 ఆల్‌టైం హైకి చేరింది. మన ఆ సమయంలో డబ్బులు మొత్తం బయటకు తీసినా.. రూ. 2.7 కోట్లు.. లేదా ఇప్పుడు తీసినా.. రూ. 96 లక్షలు రాబడి వస్తుంది. ఫిగర్స్ చూసి ఆశ్చర్యపోకండి. ఇది నిజంగా నిజం.! ఈ కంపెనీకి ప్రమోటర్స్ 74.39 శాతం ఉండగా.. ఫారిన్ ఇన్వెస్టర్లు 1.38 శాతం, ఇక ఇండియన్ ఇన్వెస్టర్లు 0.12 శాతంగా ఉన్నారు.
అలాగే ఈ సంస్థ పేరెంట్‌గా ఆ తర్వాత ఐపీవోకు వచ్చిన Waaree Energies కూడా పెద్ద హిట్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ షేర్ ధర రూ. 3046.7గా ఉంది. కాగా, స్టాక్స్ ఎక్కడో చూశాం కదా.. తక్కువకు దొరుకుతున్నాయి అని పేలవమైన వాటిల్లో పెట్టకూడదు. ఓ సంస్థ గ్రోత్, ఆదాయం, లాభాలు, అప్పులు, మార్కెట్ క్యాప్, ఆర్డర్స్ లాంటివి క్షుణ్ణంగా పరిశీలించి.. మంచి స్టాక్‌లో పెడితే మీ భవిష్యత్తు సురక్షితంగా ఉంటుందని బిజినెస్ అనలిస్టులు చెబుతున్నారు.
