Tax Scheme: రూ.35 లక్షల కోట్ల పన్ను వసూళ్లకు ప్రభుత్వం సిద్ధం.. సరికొత్త పథకం

ఆదాయపు పన్ను చెల్లింపుదారుల నుంచి రూ. 35 లక్షల కోట్ల పన్ను వసూలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికను రూపొందించింది. అక్టోబర్ 1 నుంచి ఈ పథకం ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన సర్క్యులర్‌ను శుక్రవారం విడుదల చేసింది..

Tax Scheme: రూ.35 లక్షల కోట్ల పన్ను వసూళ్లకు ప్రభుత్వం సిద్ధం.. సరికొత్త పథకం
Tax
Follow us
Subhash Goud

|

Updated on: Sep 20, 2024 | 7:16 PM

ఆదాయపు పన్ను చెల్లింపుదారుల నుంచి రూ. 35 లక్షల కోట్ల పన్ను వసూలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికను రూపొందించింది. అక్టోబర్ 1 నుంచి ఈ పథకం ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన సర్క్యులర్‌ను శుక్రవారం విడుదల చేసింది. పన్ను వివాదాలకు సంబంధించిన ఈ పథకం పేరు ‘వివాద్ సే విశ్వాస్ 2.0’. పెండింగ్‌లో ఉన్న ఆదాయపు పన్ను వివాదాలను పరిష్కరించడానికి ఇది ఒక పథకం. జూలైలో సమర్పించిన 2024-25 బడ్జెట్‌లో ఈ పథకాన్ని ప్రకటించారు.

ఇది కూడా చదవండి: TRAI Rules: ఇక అలా చేస్తే కుదరదు..టెలికాం కంపెనీలకు షాక్‌.. అక్టోబర్‌ 1 నుంచి కొత్త నిబంధనలు

బడ్జెట్‌లో ప్రకటన:

ఇవి కూడా చదవండి

ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక నోటిఫికేషన్‌లో, కేంద్ర ప్రభుత్వం వివాద్ సే విశ్వాస్ 2.0′ పథకానికి అక్టోబర్ 1, 2024 తేదీగా నిర్ణయించింది. దాదాపు రూ.35 లక్షల కోట్ల విలువైన 2.7 కోట్ల ప్రత్యక్ష పన్ను క్లెయిమ్‌లు వివిధ కోర్టుల్లో వివాదంలో ఉన్నాయి. అందువల్ల వివాదాన్ని పరిష్కరించేందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌లో ఈ పథకాన్ని ప్రకటించారు. పన్నులను సరళీకరించడం, పన్ను చెల్లింపుదారుల సేవలను మెరుగుపరచడం, పన్ను ఖచ్చితత్వాన్ని అందించడం, ఆదాయాన్ని పెంచడంతోపాటు వ్యాజ్యాలను తగ్గించడం వంటి చర్యలను ప్రభుత్వం కొనసాగిస్తుందని ఆ సమయంలో ఆమె తెలిపారు.

రూ. 50 లక్షల కంటే పెద్ద కేసులు అవసరం

పన్ను వివాదాలకు సంబంధించిన కేసులను తగ్గించేందుకు, ప్రభుత్వం 2024-25 బడ్జెట్‌లో ‘వివాద్ సే విశ్వాస్’ పథకం-2ను ప్రవేశపెట్టింది. ఆదాయపు పన్ను కేసుల రీవాల్యుయేషన్ కోసం ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగం ప్రకారం.. అసెస్‌మెంట్ సంవత్సరం ముగిసిన తర్వాత 3 సంవత్సరాల నుండి 5 సంవత్సరాల వరకు ఆదాయపు పన్ను సంబంధిత కేసులను తిరిగి తెరవవచ్చు. కానీ ఈ కేసులు రూ.50 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఉండాలనే షరతు ఉంది.

ఇది కూడా చదవండి: Gold Rates: వామ్మో.. తగ్గేదిలే అంటున్న బంగారం ధర.. సాయంత్రానికే ఇంత పెరిగిందా? ఎంతో తెలిస్తే..

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి