దేవుళ్లకు తప్పని కరోనా కష్టాలు.. జూలై 31న వర్చువల్ వరలక్ష్మీ వ్రతం..
కోవిద్-19 విజృంభిస్తోంది. దేశంలో రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో సిరుల తల్లి తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో జూలై 31న శుక్రవారం ఉదయం 10 నుంచి 12 గంటల వరకు

కోవిద్-19 విజృంభిస్తోంది. దేశంలో రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో సిరుల తల్లి తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో జూలై 31న శుక్రవారం ఉదయం 10 నుంచి 12 గంటల వరకు వరలక్ష్మీ వ్రతం ఏకాంతంగా నిర్వహించనున్నట్లు టీటీడీ జెఈవో తెలిపారు. ప్రతి ఏడాది పవిత్రమైన శ్రావణ మాసంలో నిర్వహించే వరలక్ష్మీ వ్రతాన్ని భక్తుల కోరిక మేరకు ఆన్‌లైన్(వర్చువల్)లో చేయాలని టీటీడీ నిర్ణయించినట్లు తెలిపారు.
కరోనా ఆంక్షల నేపథ్యంలో.. ఈ ఏడాది భక్తులకు అమ్మవారి ఆలయంలో ప్రత్యక్షంగా నిర్వహించే శ్రావణ వరలక్ష్మీ వ్రతంలో పాల్గొనే అవకాశం లేదని తెలిపారు. భక్తులకు తమ నివాస ప్రాంతాల నుండి ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించి, పాల్గొనే అవకాశం టీటీడీ కల్పిస్తుందన్నారు. వరలక్ష్మీ వ్రతం టికెట్లు జూలై 22వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి జూలై 30వ తేదీ సాయంత్రం 5గంటల వరకు గృహస్తులు టీటీడీ వెబ్‌సైట్ ద్వారా పొందవచ్చన్నారు.