కరోనా ఎఫెక్ట్: ‘వారానికి ఐదు రోజుల పని’ కోసం బ్యాంకు ఉద్యోగుల డిమాండ్..
కరోనావైరస్ ముప్పు బ్యాంకర్లను వెంటాడుతోందని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తెలిపింది. బ్యాంక్ ఉద్యోగుల సంఘాలు మళ్ళీ వారానికి ఐదు రోజుల పని కోసం డిమాండ్ చేస్తున్నాయి. ఖాతాదారులు ఎక్కువగా

కరోనావైరస్ ముప్పు బ్యాంకర్లను వెంటాడుతోందని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తెలిపింది. బ్యాంక్ ఉద్యోగుల సంఘాలు మళ్ళీ వారానికి ఐదు రోజుల పని కోసం డిమాండ్ చేస్తున్నాయి. ఖాతాదారులు ఎక్కువగా సందర్శించడం వల్ల ముప్పు పెరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. గతంలోనూ ఐదు రోజుల పనికోసం దేశవ్యాప్తంగా ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. విడతల వారీగా ఆందోళన చేపట్టాయి.
ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబిఎ) జనవరిలో యూనియన్ల చేసిన ‘వారానికి ఐదు రోజుల పని’ ప్రతిపాదనను తిరస్కరించింది, బదులుగా, ఉద్యోగులకు 19 శాతం వేతన పెంపును ఇచ్చింది. ప్రస్తుతం, బ్యాంకులకు ప్రతి నెల రెండవ, నాల్గవ శనివారాలు, ప్రతి ఆదివారం సెలవులు ఉంటాయి. బ్యాంకు శాఖల్లో సరైన వసతులు లేకపోవడం, సరిపడా అధికారులు లేకపోవడంతో ఉన్నవారే పగలూ, రాత్రీ పనిచేయాల్సి వస్తోందని ఉద్యోగుల సంఘం వాపోయింది. సెలవు రోజులు, ఆదివారాల్లోనూ అధికారులను విధులకు రావాలని ఆదేశించడంతో వ్యక్తిగత జీవితం నష్టపోతున్నారని పేర్కొంది.



