విజయవాడవాసులకు పలు సూచనలు
విజయవాడ ప్రజలకు నగర కమిషనర్ ప్రసన్న వెంకటేష్ పలు సూచనలు చేశారు. కృష్ణా బ్యారేజీకి వరద ప్రవాహం పెరుగుతోందని నగర కమిషనర్ వెల్లడించారు. కృష్ణా పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు...

విజయవాడ ప్రజలకు నగర కమిషనర్ ప్రసన్న వెంకటేష్ పలు సూచనలు చేశారు. కృష్ణా బ్యారేజీకి వరద ప్రవాహం పెరుగుతోందని నగర కమిషనర్ వెల్లడించారు. కృష్ణా పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ఎప్పడికప్పుడు ఆయన స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లోనివారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.
నగరంలోని దివినగర్, భూపేష్ గుప్తా నగర్, తారకరామనగర్, భవానీపురం, విద్యాధపురం ప్రాంతాల ప్రజలు పునరావాస కేంద్రాలకు వెళ్లాలని ఆయన కోరారు. కార్పొరేషన్ హెల్ప్‌లైన్ నెంబర్లు ఏర్పాటు చేశారు. అవసరమైతే ప్రజలు ఈ టోల్ ఫ్రీ నెంబర్ 0866-2424172, 2422515కు ఫోన్ చేయాలని వెంకటేశ్ తెలిపారు. ప్రవాహ ఉధృతిని ఎప్పటకప్పుడు గమనించాలని సూచించారు. వరద ప్రవాహం మరింతగా ఉంటుందని ముందస్తు అంచనా వేశారు. బ్యారేజీ వద్ద ప్రవాహం అధికంగా ఉండటంతో అటు వైపు ఎవరూ రావద్దని హెచ్చరించారు




