Viral Video: పెళ్లికి అడ్డుకాని అంగవైకల్యం..”ఒంటికాలు పెళ్లికొడుకు” ఇరగదీసిండు.. మనసును హత్తుకునే వీడియో

కొంతమంది తమకు కలిగిన అంగవైకల్యాన్ని చూసుకుని ప్రతీ రోజూ బాధపడుతుంటారు. మరికొందరు అయితే అంగవైకల్యం ఉన్నా.. దాన్ని పట్టించుకోకుండా..

Viral Video: పెళ్లికి అడ్డుకాని అంగవైకల్యం..ఒంటికాలు పెళ్లికొడుకు ఇరగదీసిండు.. మనసును హత్తుకునే వీడియో
Viral Dance
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 08, 2021 | 12:12 PM

కొంతమంది తమకు కలిగిన అంగవైకల్యాన్ని చూసుకుని ప్రతీ రోజూ బాధపడుతుంటారు. మరికొందరు అయితే అంగవైకల్యం ఉన్నా.. దాన్ని పట్టించుకోకుండా ఎన్నో గొప్ప విజయాలను, ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే.! ఒక కాలు కోల్పోయిన ఓ వ్యక్తి.. తన అంగవైకల్యంపై ఏమాత్రం చింత లేకుండా పెళ్లి వేడుకలో స్టెప్పులతో ఇరగదీశాడు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.

సోషల్ మీడియాలో అనేక వీడియోలు మిమ్మల్ని అబ్బురపరుస్తుంటాయి. వాటిల్లో కొన్ని భావోద్వేగాలకు గురి చేస్తాయి. మరికొన్ని కన్నీళ్లు తెప్పిస్తాయి.. ఇంకొన్ని సంతోషాన్ని కలిగిస్తాయి. అలాంటి వీడియోనే ఇది. ఇందులో పెళ్లి కొడుకు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలుస్తాడు. లేట్ ఎందుకు వీడియోపై ఓ లుక్కేయండి..

వీడియోలో ఉన్న వ్యక్తి పేరు అంకిత్ చౌహాన్. అతనికి ఓ కాలు లేదు. అయినా కూడా తన పెళ్ళిలో చాలా అందంగా డ్యాన్స్ చేసి అందరినీ అలరిస్తాడు. వధువు కూడా అంకిత్ స్టెప్పులకు సంతోషాన్ని వ్యక్తం చేసింది. అతిధులు కూడా అంకిత్ డ్యాన్స్ మూమెంట్స్‌కి ఫిదా అయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, ఈ వీడియోను అంకిత్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో నెటిజన్లతో షేర్ చేయగా.. ‘చక్కటి జోడి’ అని కొందరు కామెంట్ చేయగా.. ‘ఇరగదీశావ్ భయ్యా’ అంటూ మరికొందరు మెచ్చుకున్నారు. రీ-షేర్స్‌తో హోరెత్తిస్తున్నారు.

Also Read:

ఏపీలో పాఠశాలల పున:ప్రారంభం అప్పుడే.. క్లారిటీ ఇచ్చిన విద్యాశాఖ మంత్రి!

సినీ పరిశ్రమకు షాక్ ఇచ్చిన జగన్ సర్కార్.. ప్రభుత్వం నిర్దేశించిన రేట్లకు టికెట్ ధరలు.!

కాబోయే భర్త రేప్ చేశాడంటూ మహిళ కేసు.. హైకోర్టు సంచలన తీర్పు.!

ఏపీ ఇంటర్ విద్యార్ధులకు అలెర్ట్.. అకడమిక్‌ క్యాలెండర్‌ షెడ్యూల్ ఖరారు.. మొత్తం 213 పనిదినాలు.!