‘అనగనగా ఓ అతిథి’ ట్రైలర్‌ను సోషల్ మీడియా వేదికగా వెంకటేష్ విడుదల చేశారు

పాయల్ రాజ్‌పుత్, చైతన్య కృష్ణ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘అనగనగా ఓ అతిథి’. కన్నడ చిత్ర పరిశ్రమలో అవార్డ్ విన్నింగ్‌ మూవీస్‌ని తెరకెక్కించిన దర్శకుడు దయాల్‌ పద్మనాభన్‌ తెలుగులో డైరెక్ట్‌ చేస్తున్న తొలి చిత్రమిది.

‘అనగనగా ఓ అతిథి’ ట్రైలర్‌ను సోషల్ మీడియా వేదికగా వెంకటేష్ విడుదల చేశారు
Follow us
Sanjay Kasula

|

Updated on: Nov 18, 2020 | 1:08 AM

పాయల్ రాజ్‌పుత్, చైతన్య కృష్ణ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘అనగనగా ఓ అతిథి’. కన్నడ చిత్ర పరిశ్రమలో అవార్డ్ విన్నింగ్‌ మూవీస్‌ని తెరకెక్కించిన దర్శకుడు దయాల్‌ పద్మనాభన్‌ తెలుగులో డైరెక్ట్‌ చేస్తున్న తొలి చిత్రమిది. అచ్చ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫాం ‘ఆహా’లో నవంబర్ 20న ఈ చిత్రం విడుదలవుతోంది. థ్రిల్లర్ జానర్‌లో రూపొందిన ఈ సినిమా ట్రైలర్‌ను మంగళవారం విక్టరీ వెంకటేష్ సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు.

ట్రైలర్ చాలా ఆసక్తికరంగా ఉంది. పాయల్ రాజ్‌పుత్ పేదింటి అమ్మాయిగా కొత్తగా కనిపిస్తున్నారు. ఓ కుటుంబ పేద‌రికంతో బాధ‌ప‌డుతుంటుంది. వారి కష్టాల‌ను దాట‌డానికి జోతిష్యుడు చెప్పిన జాత‌కం, వారి జీవితంలోకి వచ్చిన అతిథి వ‌ల్ల వారికి ఎదురైన పరిస్థితుల చుట్టూ కథ తిరుగుతుంది. దురాశ, మోహం, అత్యాశ వంటి అంశాలను సూచించేలా ఇందులో పాత్రలు ఉంటాయి. నిజ జీవిత ఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందించినట్టు చిత్ర యూనిట్ పేర్కొంది.

ఎమోషన్స్, డ్రామా, సస్పెన్స్.. ఇలా అన్ని అంశాలు ఉన్న సినిమా ‘అనగనగా ఓ అతిథి’. ‘ ఆర్ఎక్స్ 100’ తరవాత పాయల్ రాజ్‌పుత్‌కు ఆ స్థాయి విజయం దక్కలేదు. ఇప్పుడు ఈ సినిమాతో కచ్చితంగా విజయాన్ని అందుకుంటానని పాయల్ ధీమాగా ఉన్నారు. అంతేకాదు, ఈ సినిమాలో తాను చేసిన పాత్రకు మంచి గుర్తింపు వస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఈ లాక్‌డౌన్ సమయంలో ‘భానుమ‌తి అండ్ రామ‌కృష్ణ’, ‘జోహార్‌’, ‘ఒరేయ్ బుజ్జిగా’, ‘క‌ల‌ర్‌ ఫొటో’ వంటి మంచి చిత్రాలతో అలరించిన ‘ఆహా’ ఇప్పుడు ‘అనగనగా ఓ అతిథి’తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకోబోతోందని అంటున్నారు. ఈ చిత్రానికి అరోల్ కొరెల్లి సంగీతం సమకూర్చారు. రాకేష్ బి సినిమాటోగ్రఫీ అందించారు.