రఫెల్ నాదల్‌కు చేదు అనుభవం..ఏటీపీ హోరా హోరీ ఫైనల్స్ పోరులో ఓటమి
సంవత్సరాంతపు టోర్నీ ఏటీపీ ఫైనల్స్‌లో వరల్డ్ నెంబర్ టూ ప్లేయర్ రఫెల్ నాదల్‌కు ఎదురుదెబ్బ తగిలింది. గ్రూప్‌దశ తన రెండో మ్యాచ్‌లో స్పెయిన్ బుల్ నాదల్..
కరోనా ఏడాదిలో రఫెల్ నాదల్‌కు చేదు అనుభవం ఎదురైంది. సంవత్సరాంతపు టోర్నీ ఏటీపీ ఫైనల్స్‌లో వరల్డ్ నెంబర్ టూ ప్లేయర్ రఫెల్ నాదల్‌కు ఎదురుదెబ్బ తగిలింది. గ్రూప్‌దశ తన రెండో మ్యాచ్‌లో స్పెయిన్ బుల్ నాదల్ 6-7, 6-7 తేడాతో మూడో ర్యాంకర్ డొమినిక్ థీమ్ చేతిలో ఓడిపోయాడు.
ఇరు సెట్లు హోరాహోరీగా జరిగినా.. టై బ్రేకర్లలో సత్తాచాటిన థీమ్ విజేతగా నిలిచాడు. కాగా వరుసగా రెండో మ్యాచ్‌లోనూ గెలిచిన డొమినిక్ సెమీస్‌కు చేరువయ్యాడు. టోర్నీలో తదుపరి మ్యాచ్ లో స్టిఫనోస్ సిట్సిపాస్‌తో నాదల్ తలపడనున్నాడు. కాగా మరో గ్రూప్ దశ మ్యాచ్‌లో డానిల్ మద్వెదెవ్ 6-3, 6-4 తేడాతో అలెగ్జాండర్ జ్వెరెవ్ పై విజయం సాధించాడు.