Fire Shoes For The Indian Army: మన ఆర్మీ కోసం సైంటిస్ట్ కృషి.. ఫైర్ షూస్ ఆవిష్కరణ..శత్రువుల గుండెల్లో బుల్లెట్ల మోతే..

Fire Shoes For The Indian Army: మన ఆర్మీ కోసం సైంటిస్ట్ కృషి.. ఫైర్ షూస్ ఆవిష్కరణ..శత్రువుల గుండెల్లో బుల్లెట్ల మోతే..

మనదేశంలో యువత తెలివితేటలకు, ప్రతిభకు కొదవు లేదు.. కావాల్సిందల్లా అవకాశాలు కల్పించడమే.వారి ఆలోచనలకు ఆలంభన దొరికితే.. చేయూతనిస్తూ.. ప్రోత్సహిస్తే.. అద్భుతాలు సృష్టిస్తారు. ఈ విషయం అనేక సార్లు రుజువయ్యింది.. ప్రపంచంలో ఎక్కడ ఏ మూలకు వెళ్లినా ఒక్క భారతీయుడైనా..

Surya Kala

|

Jan 17, 2021 | 4:31 PM

Fire Shoes For The Indian Army:  మనదేశంలో యువత తెలివితేటలకు, ప్రతిభకు కొదవు లేదు.. కావాల్సిందల్లా అవకాశాలు కల్పించడమే.వారి ఆలోచనలకు ఆలంభన దొరికితే.. చేయూతనిస్తూ.. ప్రోత్సహిస్తే.. అద్భుతాలు సృష్టిస్తారు. ఈ విషయం అనేక సార్లు రుజువయ్యింది.. ప్రపంచంలో ఎక్కడ ఏ మూలకు వెళ్లినా ఒక్క భారతీయుడైనా ఉంటాడు అంటే అర్ధం చేసుకోవచ్చు. భారతీయుల కష్టపడే తత్వాన్ని.

తాజాగా ఓ యంగ్ సైంటిస్ట్ తన ఆలోచనలకు పదును పెట్టాడు.. దేశ రక్షణలో ప్రాణాలను ఒడ్డి కావలా కాస్తున్న సైనికుల కోసం ఓ అద్భుతాన్ని ఆవిష్కరించాడు. భారత్ లో ఎంతో అత్యద్భుతమైన సైంటిస్టులు ఉన్నారని మరోసారి నిరూపించాడో యంగ్ సైంటిస్టు శ్యామ్ చౌరాసియా. ఉత్తరప్రదేశ్ లోని వారణాసికి చెందిన యంగ్ సైంటిస్టు శ్యామ్ చౌరాసియా ఇండియన్ ఆర్మీ కోసం ప్రత్యేక షూస్ తయారుచేసి భారత యువత ప్రతిభను మరోసారి ప్రపంచం ముందు ఆవిష్కరించాడు.

శ్యామ్ చౌరాసియా తయారుచేసిన షూస్ సాధారణమైనవి కాదు. సరిహద్దుల్లో చొరబాట్లను అడ్డుకోగలవు. సరిహద్దుల్లోకి శత్రు మూకలు ప్రవేశిస్తున్నారని తెలిస్తే చాలు …20 కిలోమీటర్ల ఇవతలి నుంచి ఆ షూష్ బుల్లెట్ల తుఫాను కురిపించగలవంటున్నాడు శ్యామ్ అశోక్. ఈ విషయం నమ్మలేక పోతున్నారు కదూ. మరి ఆ ‘స్పెషల్ షూష్’ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ప్రతీ భారతీయుడికి ఉంది.

ప్రధాని మోడీ పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసికి చెందిన యంగ్ సైంటిస్ట్ శ్యామ్ చౌరాసియా వారణాసిలోని ఓ సంస్థలో రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఇన్‌ఛార్జి గా పనిచేస్తున్నాడు. శ్యామ్ తయారుచేసిన ఈ షూస్ కి రెండు మడతపెట్టిన 9mm గన్ బ్యారెల్స్ ఉంటాయి. ఈ షూస్… రేడియో ఫ్రీక్వెన్సీలు, మొబైల్ నెట్‌వర్కుల ఆధారంగా పనిచేస్తాయి. సౌండ్‌ ఆధారంగా శత్రువుల రాకను గుర్తిస్తాయి. అంతే క్షణాల్లో బుల్లెట్లు కురిపిస్తాయి. ఈ షూస్ ఒక్కొటక్కటి ఆరున్నర కేజీల బరువుంటుంది.

రబ్బర్, స్టీల్ ప్లేట్లను మిక్స్ చేసి వీటిని తయారుచేశారు. ఇవి బుల్లెట్ల వర్షం కురిపించడమే కాదు… సియాచిన్‌లో మైనస్ డిగ్రీల వాతావరణంలో సైనికులకు వెచ్చదనం కూడా ఇస్తాయి. ఎందుకంటే ఈ షూలలో ప్రత్యేకమైన హీటర్ కూడా ఉంటుంది. వీటికి ఇంకా ఎన్ని ప్రత్యేకతలు ఉన్నాయంటే… సోలార్ ఛార్జింగ్ సిస్టం, స్టీల్ షీట్, లెడ్ లైట్, సోలార్ ప్లేట్ రేడియో సర్క్యూట్, స్విచ్ అండ్ వైబ్రేషన్ మోటర్, ఎలక్ట్రానిక్ ట్రిగ్గర్ ఉన్నాయి.

ఈ ఫైర్ షూల లేజర్ సెన్సార్, హ్యూమన్ సెన్సార్ లను బోర్డర్ దగ్గర సెట్ చేయాలి. అప్పుడు శత్రువులు సరిహద్దులు దాటి వచ్చేందుకు యత్నిస్తే… వెంటనే షూలకు ఉండే సెన్సార్లు గుర్తిస్తాయని యంగ్ సైంటిస్టు శ్యామ్ చౌరాసియా చెప్పాడు. అలా గుర్తించిన వెంటనే షూస్ సెన్సార్ యాక్టివ్ మోడ్ లోకి వచ్చి సిగ్నల్స్ షూ కి అందుతాయి. బీప్ బీప్ మంటూ శబ్దాలు చేస్తుంది. అంతేకాదు… వెంటనే షూ నుంచి బుల్లెట్స్ దూసుకెళ్తాయి. ఈ సమయంలో సైనికులు కూడా అలర్ట్ అయ్యి… శత్రుమూకల పని పట్టొచ్చని శ్యామ్ చెప్పారు.

సర్వ సాధారణంగా సైనికులు తమ చేతిలోని ప్రత్యేక తుపాకులతో శతృవులపై కాల్పులు జరుపుతారు. ప్రత్యేక పరిస్థితుల్లో చేతుల్లో ఆయుధాలు లేనప్పుడు అచ్చంగా.. జేమ్స్ బాండ్ సినిమాల్లో లాగా… మన సైనికులు ఈ షూలతో కూడా కాల్పులు జరపవచ్చు అంటున్నాడు శ్యామ్. అంతేకాదు ఈ షూస్ మరో ప్రత్యేక ఏమిటంటే.. అవి ముందునుంచే కాదు.. వెనుక నుంచి కూడా కాల్పులు జరపగలవన్నారు శ్యామ్. త్వరలో వీటి ప్రత్యేకతను వివరిస్తూ.. కేంద్ర ప్రభుత్వానికి, రక్షణ శాఖకి ఓ లెటర్ రాయబోతున్నానని తెలిపారు. వీటిని ఆర్మీ ఆమోదిస్తే… ఇక ఉగ్రమూకలపై బుల్లెట్ల వర్షం కురవటం తప్పదు.. ఇన్ని ప్రత్యేకతలు కలిగిన ఈ షూస్ వేసుకుంటే శత్రువుల గుండెల్లో దడ దడే.

Also Read: మళ్ళీ కరోనా పుట్టిల్లు చైనాలో పెరుగుతున్న కేసులు, 5 రోజుల్లో 1500పడకల ఆస్పత్రి నిర్మాణం

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu