లాక్‌డౌన్ ఎఫెక్ట్: జనసమూహాలకు డ్రోన్లతో చెక్…
కోవిద్ 19 ధాటికి ప్రపంచ దేశాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. లాక్‌డౌన్ సమయంలో ఇళ్లలోంచి కదలరాదన్న ఆదేశాలను బేఖాతరు చేస్తూ రోడ్లపైకి వచ్చే గుంపులకు

Drones: కోవిద్ 19 ధాటికి ప్రపంచ దేశాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. లాక్‌డౌన్ సమయంలో ఇళ్లలోంచి కదలరాదన్న ఆదేశాలను బేఖాతరు చేస్తూ రోడ్లపైకి వచ్చే గుంపులకు ఉత్తరాఖండ్ పోలీసులు ‘డ్రోన్ల’ సాయంతో చెక్ పెట్టారు. విజయవంతంగా దీన్ని అమలు చేసి అందరి అభినందనలు అందుకున్నారు. ఇందుకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ఐటీడీఏ) అధికారుల సహకారాన్ని పోలీసు సిబ్బంది తీసుకుంది.
కాగా.. ‘మేము ఐటీడీఏ నుంచి వచ్చాం. డ్రోన్లు అందించే సమాచారంతో పోలీసులతో ఎప్పటికప్పుడు పంచుకుంటున్నాం. డ్రోన్లు తీసే ఫోటోలను పోలీసు ఇంటెలిజెన్స్ టీమ్‌కు పంపుతున్నాం. గత కొద్ది రోజులుగా మా బృందానికి చెందిన ముగ్గురు ఈ పనిలోనే ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 56 ప్రాంతాలపై డోన్ల నిఘా ఉంది’ అని ఐటీడీఏ అధికారి వైభవ్ తెలిపారు.