యాత్రికులపై దూసుకెళ్లిన బస్సు.. ఏడుగురు మృతి..!

ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. పుణ్యస్నానానికి వెళ్లినవారు అనుకొని ముప్పు రావడంతో తిరిగిరాని లోకాలకు చేరుకున్నారు. వేగంగా దూసుకొచ్చిన యాత్రికుల బస్సు గంగానదీ తీరంలో నిద్రిస్తున్న వారిపై నుంచి పోవడంతో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. బులంద్ షహార్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. బులంద్ షహర్‌లోని గంగానదీ తీరంలోని నరౌరా ఘాట్‌లో స్నానం ఆచరించేందుకు వచ్చిన భక్తులు రోడ్డు పక్కన నిద్రపోతున్నారు. వైష్ణోదేవి ఆలయం నుంచి యాత్రికులతో వేగంగా వచ్చిన బస్సు ఘాట్ […]

యాత్రికులపై దూసుకెళ్లిన బస్సు.. ఏడుగురు మృతి..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Oct 11, 2019 | 1:11 PM

ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. పుణ్యస్నానానికి వెళ్లినవారు అనుకొని ముప్పు రావడంతో తిరిగిరాని లోకాలకు చేరుకున్నారు. వేగంగా దూసుకొచ్చిన యాత్రికుల బస్సు గంగానదీ తీరంలో నిద్రిస్తున్న వారిపై నుంచి పోవడంతో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. బులంద్ షహార్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. బులంద్ షహర్‌లోని గంగానదీ తీరంలోని నరౌరా ఘాట్‌లో స్నానం ఆచరించేందుకు వచ్చిన భక్తులు రోడ్డు పక్కన నిద్రపోతున్నారు. వైష్ణోదేవి ఆలయం నుంచి యాత్రికులతో వేగంగా వచ్చిన బస్సు ఘాట్ వద్ద రోడ్డు పక్కన నిద్రపోతున్న భక్తులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు మహిళలు, ముగ్గురు పిల్లలు అక్కడికక్కడే మరణించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. కేసు నమోదు చేశారు. మృతదేహాలను పోస్టుమార్డం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గాయాల పాలైన వారికి చికిత్స అందిస్తున్నారు. కాగా, బస్సు ప్రమాద ఘటన అనంతరం డ్రైవరు బస్సు వదిలి పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బస్సు డ్రైవర్ కోసం గాలింపు చేపట్టారు.