AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అటు భారీ వర్షాలు.. ఇటు ఆర్టీసీ సమ్మె.. నలిగిపోతున్న సామన్యుడు..!

తెలంగాణలో సామాన్యుడి పరిస్థితి మారీ దారుణంగా ఉంది. ఒక వైపు భారీ వర్షాలు.. మరోవైపు ఆర్టీసీ సమ్మె.. తీవ్రప్రభావం చూపుతున్నాయి. భారీ వర్షాలతో.. జనాలు అల్లకల్లోలు అవుతూ.. రోగాల బారిన పడుతుంటే.. ఆర్టీసీ సమ్మె.. ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తుంది. గత కొద్ది రోజులుగా.. తెలంగాణలో తీవ్ర వర్షా ప్రభావం నెలకింది. దీంతో.. జనాలు అష్టకష్టాలు పడుతున్నారు. దానికి తోడు ఇప్పుడు ఆర్టీసీ సమ్మె తోడయ్యింది. ఇంకేముంది.. సామాన్యుడి బతుకు జట్కా బండిలాగ సాగుతోంది. […]

అటు భారీ వర్షాలు.. ఇటు ఆర్టీసీ సమ్మె.. నలిగిపోతున్న సామన్యుడు..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 11, 2019 | 1:07 PM

Share

తెలంగాణలో సామాన్యుడి పరిస్థితి మారీ దారుణంగా ఉంది. ఒక వైపు భారీ వర్షాలు.. మరోవైపు ఆర్టీసీ సమ్మె.. తీవ్రప్రభావం చూపుతున్నాయి. భారీ వర్షాలతో.. జనాలు అల్లకల్లోలు అవుతూ.. రోగాల బారిన పడుతుంటే.. ఆర్టీసీ సమ్మె.. ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తుంది. గత కొద్ది రోజులుగా.. తెలంగాణలో తీవ్ర వర్షా ప్రభావం నెలకింది. దీంతో.. జనాలు అష్టకష్టాలు పడుతున్నారు. దానికి తోడు ఇప్పుడు ఆర్టీసీ సమ్మె తోడయ్యింది. ఇంకేముంది.. సామాన్యుడి బతుకు జట్కా బండిలాగ సాగుతోంది.

గత నెల సెప్టెంబర్‌ నుంచి తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో.. రోడ్లన్నీ జలమయవుతున్నాయి. రోడ్లపైకి.. ఇళ్లలోకి నీరు చేరుతోంది. కొన్ని రోజుల క్రితమైతే.. నడుము లోతు నీరు చేరింది. దీంతో.. ప్రజలు బయటకి రాలేని పరిస్థితి నెలకొంది. ఇప్పటికీ కూడా వరుణుడి ప్రతాపం చూపిస్తూనే ఉన్నాడు. దీంతో ప్రజలు అల్లాడుతున్నారు. ఇక.. జిల్లాలవారీగా.. కూడా వర్షం దంచికొడుతోంది. దీంతో.. చేతి కొచ్చిన పంట నేలపాలవుతోంది. దాంతో.. రైతులు లబోదిబోమంటున్నారు. ఈ భారం కాస్తా.. సామాన్యుడిపై పడుతోంది. ఇప్పటికే ఉల్లి రేటుతో కన్నీరు పెట్టిస్తోంది. అలాగే.. టమాటా రేటు కూడా బరువెక్కుతోంది. ఇప్పడు.. కూరగాయల ధరలు తలనొప్పి తెప్పిస్తున్నాయి.

ఇక ఆర్టీసీ సమ్మె‌ జనాలకి చుక్కలు చూపిస్తోందనే చెప్పాలి. సరిగ్గా.. దసరా పండగకు స్ట్రైక్‌ స్టార్ట్ చేశారు ఆర్టీసీ కార్మికులు. దీంతో.. ప్రజలు ఊరు దాటలేని పరిస్థితి ఏర్పడింది. ఇదే అదునుగా.. ప్రైవేటు ట్రావెల్స్.. తమ చేతివాటం ప్రదర్శించారు. రెండు రోజులైనా సమ్మె సర్దుకుంటుంది అంటే.. ఆర్మీసీ కార్మికులు మొండి పట్టు వదలడం లేదు. అప్పటికీ ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా.. బస్సులను, తాత్కాలిక డ్రైవర్లను, కండెక్టర్లను ఏర్పాటు చేసినా.. వారు కూడా.. అధిక రేట్లు వసూలు చేస్తున్నారు. ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులైతే.. తప్పదు అన్న చందంగా.. వారు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది ఒక ఎత్తుఅయితే.. ఆర్టీసీ సమ్మెతో కూరగాయల ధరలు రెట్టింపు అయ్యాయి. దీంతో.. సామాన్యుడికి పరిస్థితి కక్కలేని.. మింగలేని పరిస్థితి ఏర్పడింది. మొత్తానికి ఇటు వర్షాలు.. అటు ఆర్టీసీ సమ్మె రెండూ.. ప్రజలను గందరగోళ స్థితిలో పడేశాయనే చెప్పాలి.

ప్రస్తుతం ఇప్పుడు హైదరాబాద్‌ మార్కెట్లో.. కిలో ఉల్లిపాయలు రూ.50, కిలో టమోటా రూ.40-45, బంగాళదుంపలు కిలో రూ.60, వంకాయలు కిలో రూ.50, బెండకాయలు కిలో రూ.60, క్యారెట్ కిలో రూ.55, క్యాప్సికమ్ కిలో రూ.65లుగా ఉన్నాయి.

Follow Us
బాబోయ్‌.. రాత్రి పూట అన్నం తింటే ఇంత డేంజరా!
బాబోయ్‌.. రాత్రి పూట అన్నం తింటే ఇంత డేంజరా!
చిరంజీవి హీరోగా.. శ్రీదేవి నిర్మాతగా ఆగిపోయిన సినిమా ఏదంటే.?
చిరంజీవి హీరోగా.. శ్రీదేవి నిర్మాతగా ఆగిపోయిన సినిమా ఏదంటే.?
నేను జోక్యం చేసుకోకుంటే పాక్ ప్రధాని చనిపోయేవాడుః ట్రంప్
నేను జోక్యం చేసుకోకుంటే పాక్ ప్రధాని చనిపోయేవాడుః ట్రంప్
వచ్చిన పార్సిల్‌.. తెరిచి చూసి భయంతో వణికిన మహిళ..
వచ్చిన పార్సిల్‌.. తెరిచి చూసి భయంతో వణికిన మహిళ..
నైరుతి దిశలో బరువైన వస్తువులను ఎందుకు ఉంచాలి? ఎలాంటి ఫలితం..
నైరుతి దిశలో బరువైన వస్తువులను ఎందుకు ఉంచాలి? ఎలాంటి ఫలితం..
రేషన్‌ కార్డుదారులకు బిగ్‌ అలర్ట్‌.. ఈ పని చేయకపోతే రేషన్‌ కట్‌!
రేషన్‌ కార్డుదారులకు బిగ్‌ అలర్ట్‌.. ఈ పని చేయకపోతే రేషన్‌ కట్‌!
రూ. 100 కోట్లు పెట్టి సినిమా తీస్తే.. థియేటర్లలో 20 టికెట్లు కూడా
రూ. 100 కోట్లు పెట్టి సినిమా తీస్తే.. థియేటర్లలో 20 టికెట్లు కూడా
మీ గుండె వందేళ్లపాటు ఆరోగ్యంగా ఉండాలంటే.. వీటిని డైట్‌లో చేర్చండి
మీ గుండె వందేళ్లపాటు ఆరోగ్యంగా ఉండాలంటే.. వీటిని డైట్‌లో చేర్చండి
విడాకుల తర్వాత తల్లయిన ఈ హీరోయిన్ ఎవరో తెలుసా.?
విడాకుల తర్వాత తల్లయిన ఈ హీరోయిన్ ఎవరో తెలుసా.?
పాత స్మార్ట్‌ఫోన్లలో విలువైన గోల్డ్‌.. భవిష్యత్ కోసం
పాత స్మార్ట్‌ఫోన్లలో విలువైన గోల్డ్‌.. భవిష్యత్ కోసం