AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Foreign Students: అమెరికాలోని విదేశీ విద్యార్థులకు షాక్.. ఓపీటీ ప్రోగ్రామ్‌ రద్దుపై బిల్లు.. పాసైతే భారతీయ యువతపై భారీ ప్రభావం

Foreign Students On F-1 Visa: అమెరికాలో చదువు, ఉద్యోగం కోసం కలలు కనే భారతీయ యువతకు షాక్ తగలనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకూ అమెరికాకు చదువుకోసం వెళ్లిన యువత...

Foreign Students: అమెరికాలోని విదేశీ విద్యార్థులకు షాక్.. ఓపీటీ ప్రోగ్రామ్‌ రద్దుపై బిల్లు.. పాసైతే భారతీయ యువతపై భారీ ప్రభావం
Us F 1 Visa
Surya Kala
|

Updated on: Jul 30, 2021 | 11:06 AM

Share

Foreign Students On F-1 Visa: అమెరికాలో చదువు, ఉద్యోగం కోసం కలలు కనే భారతీయ యువతకు షాక్ తగలనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకూ అమెరికాకు చదువుకోసం వెళ్లిన యువత.. చదువు పూర్తి అయ్యాక.. అక్కడే ఉంటూ..ఉద్యోగం వేసుకోవడానికి అప్షనల్ ప్రాక్టీస్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో భాగమయ్యేవారు. తమ చదువుకు తగిన ఉద్యోగం లభించిన తర్వాత అమెరికాలో జాబ్ చేస్తూ..అమెరికాలో విద్యార్థిగా అడుగు పెట్టి.. ఉద్యోగిగా కెరీర్ ని ప్రారంభించి జీవితంలో సెటిల్ అయ్యేవారు.. అయితే ఇక నుంచి యువత అమెరికాకు చదువుకోవడానికి తప్ప.. చదువు తర్వాత అక్కడే ఉండి ఉద్యోగం వేసుకునే వీలు ఉండదు అని తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే..

అమెరికాలో ఉన్నత చదువుల కోసం తమ దేశం వచ్చే విద్యార్థులు ఇక నుంచి చదువు పూర్తయ్యాక స్వదేశానికి వెళ్లిపోవాల్సిందే ఆ దేశానికి చెందిన చట్టసభ సభ్యులు కొందరు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ మేరకు ప్రతినిధుల సభలో బిల్లు పెట్టాలని కోరుతున్నారు. చదువు పూర్తయినా అక్కడే ఉంటూ ఉద్యోగం వెదుక్కునేందుకు వీలు కల్పిస్తూ అప్షనల్ ప్రాక్టీస్ ట్రైనింగ్ ప్రోగ్రాం ని రద్దు చేయాలని కోరుతూ ఇప్పటికే ఓ బిల్లుని సైతం ప్రవేశపెట్టారు. ఓపీటీ వల్ల అమెరికాకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు అన్యాయం జరుగుతోందని కాంగ్రెస్‌ సభ్యులు చెప్పారు. విదేశీ విద్యార్థులు తక్కువ జీతానికే పనిచేయడంతో అమెరికాలోని వ్యాపార సంస్థలు వారిని నియమించుకుంటున్నాయని.. దీంతో స్థానిక విద్యార్థులకు అన్యా యం జరుగుతుందని ఆరోపిస్తున్నారు.

అందుకనే ఓపీటీని తొలగించాలని కోరుతున్నారు. ఈ మేరకు ప్రతినిధుల సభ్యలో బిల్లు ప్రవేశ పెట్టారు. ఒకవేళ ఈ బిల్లు పాసై చట్టంగా మారితే అమెరికాలో చదువుకోవడానికి వెళ్లిన వేలమంది విదేశీ విద్యా ర్థులకు నష్టం జరగనుంది. అమెరికాలో చదువు పూర్తి ఐన వెంటనే స్వదేశాలకు తరలివెళ్లాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ బిల్లు ప్రభావం భారతీయ విద్యార్ధులపై పడనున్నట్లు తెలుస్తోంది.ఓపీటీ ఆధారంగా అమెరికాలో 80 వేల మంది భారతీయ విద్యార్థులు ఉంటున్నారు. భారతదేశం నుంచి అమెరికా కు చదువు నిమిత్తం 2019-20 ఏడాదిలో . 1,93,124మంది విద్యార్థులు వెళ్లగా 2018-19 ఏడాదిలో 2,02,014మంది వెళ్లారు.  వారు ఈ బిల్ పాసైతే ఇబ్బందులు ఎదుర్కోనున్నారు.

Also Read:  అంచనాలు లేకుండా బరిలోకి దిగి పతాకాన్ని తెస్తున్న లవ్లీనా .. పసిడి కోసం ప్రయత్నిస్తా..