మెట్రో ప్రయాణికుల మరో బంపర్ ఆఫర్

ప్రయాణికులను గమ్యం చేరవేతలో రికార్డు సృష్టిస్తున్న హైదరాబాద్ మెట్రో మరో ఆఫర్ తీసుకువచ్చింది. రేపటి నుంచి మెట్రో ప్రయాణికులకు మరో బంపర్‌ ఆఫర్‌ అందుబాటులోకి రానుంది.

మెట్రో ప్రయాణికుల మరో బంపర్ ఆఫర్
Balaraju Goud

|

Oct 31, 2020 | 5:39 PM

ప్రయాణికులను గమ్యం చేరవేతలో రికార్డు సృష్టిస్తున్న హైదరాబాద్ మెట్రో మరో ఆఫర్ తీసుకువచ్చింది. రేపటి నుంచి మెట్రో ప్రయాణికులకు మరో బంపర్‌ ఆఫర్‌ అందుబాటులోకి రానుంది. మెట్రో స్మార్ట్ రీఛార్జ్‌పై 50 శాతం వరకు అంటే దాదాపు రూ.600 వరకు క్యాష్ బ్యాక్ వచ్చే ఆఫర్ అమల్లోకి తీసుకురానున్నట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. మెట్రో స్టేషన్లు, ఆన్‌లైన్‌లో రీఛార్జ్‌ చేసుకునే వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తించనుందని ఆయన స్పష్టం చేశారు. ప్రయాణికులకు వచ్చే క్యాష్ బ్యాక్ కూడా స్మార్ట్ కార్డులోనే జమ చేయనున్నట్లు మెట్రో ఎండీ వివరించారు. అయితే, రీఛార్జ్‌ చేసుకున్న మొత్తాన్ని 90 రోజుల్లోగా వినియోగించుకోవాలని ఎన్వీఎస్ రెడ్డి పేర్కొన్నారు.

హైదరాబాద్ లో పెరుగుతున్న రద్దీ దృష్ట్యా నగరవాసులు ఎక్కువగా మెట్రో రైల్‌లో ప్రయాణించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు. నగరంలోని మూడు కారిడార్లలో కలిపి నిత్యం 1.30 లక్షల మంది వరకు ప్రయాణిస్తున్నారన్నారు. ఇటీవల సువర్ణ ప్యాకేజీలో భాగంగా 40 శాతం రాయితీ ప్రకటించిన అనంతరం ప్రయాణికుల సంఖ్య 30 శాతం పెరిగిందని వివరించారు. మెట్రో భద్రతతో పాటు ప్రయాణికుల భద్రతకు హైదరాబాద్ మెట్రో అధిక ప్రధాన్యత ఇస్తుందన్న ఆయన,, అలాగే మెట్రోలో ప్రయాణించేవారు తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu