కేబినెట్‌ స్పెల్లింగే రాదు కానీ ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్‌ను విమర్శిస్తున్నారు

విమర్శలు, ప్రతి విమర్శలతో బీహార్‌ ఎన్నికల సభలు హోరెత్తుతున్నాయి.. సభలు సమావేశాలకు కోవిడ్‌-19 నిబంధనలు ఉన్నా.. నేతల మాటలకు లేవు కాబట్టే ధ్వని కాలుష్యం పెరుగుతోంది.. ఆర్‌జేడీ నేత, మహాగడ్బంధన్‌ ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వీ యాదవ్‌పై కేంద్ర మంత్రి అశ్వినీ చౌబే సెటైర్లు వేశారు. కేబినెట్ అన్న పదానికి స్పెల్లింగ్‌ కూడా రాని తేజస్వీ యాదవ్‌ ఇంజనీరింగ్ చదివిన ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ను విమర్శించేటంతవాడయ్యాడా అని ఎద్దేవా చేశారు. రాష్ట్ర సమస్యలపై అవగాహన లేని వ్యక్తి, కనీసం టెంత్‌ […]

కేబినెట్‌ స్పెల్లింగే రాదు కానీ ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్‌ను విమర్శిస్తున్నారు
Follow us

|

Updated on: Oct 31, 2020 | 5:34 PM

విమర్శలు, ప్రతి విమర్శలతో బీహార్‌ ఎన్నికల సభలు హోరెత్తుతున్నాయి.. సభలు సమావేశాలకు కోవిడ్‌-19 నిబంధనలు ఉన్నా.. నేతల మాటలకు లేవు కాబట్టే ధ్వని కాలుష్యం పెరుగుతోంది.. ఆర్‌జేడీ నేత, మహాగడ్బంధన్‌ ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వీ యాదవ్‌పై కేంద్ర మంత్రి అశ్వినీ చౌబే సెటైర్లు వేశారు. కేబినెట్ అన్న పదానికి స్పెల్లింగ్‌ కూడా రాని తేజస్వీ యాదవ్‌ ఇంజనీరింగ్ చదివిన ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ను విమర్శించేటంతవాడయ్యాడా అని ఎద్దేవా చేశారు. రాష్ట్ర సమస్యలపై అవగాహన లేని వ్యక్తి, కనీసం టెంత్‌ కూడా పాసవ్వని ఓ వ్యక్తి ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్ అయిన నితీశ్‌కుమార్‌ను విమర్శిస్తున్నారని దెప్పిపొడిచారు. ఆయన తండ్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కూడా ఇంతకు ముందు ఉద్యోగాల హామీ ఇచ్చినవారేనని అశ్వినీ చౌబే అన్నారు.. లాలూ తన మొదటి కేబినెట్‌లో లక్ష ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇచ్చి మాట తప్పారని, ఇప్పుడు తేజస్వీ యాదవ్‌ కూడా అదే పని చేస్తారని అన్నారు. ఇప్పటికీ ఆ ఉద్యోగాల కోసం నిరుద్యోగులు చేసుకున్న అప్లికేషన్లు చెత్తబుట్టలో పడి ఉన్నాయని చెప్పారు. ఉద్యోగాల పేరు చెప్పి అప్పుడు ఆర్‌జేడీ నేతలు డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు. ఆర్‌జేడీ-కాంగ్రెస్‌ కూటమి సాధ్యంకాని హామీలు ఇస్తూ ప్రజలను మోసం చేస్తున్నదని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

శరీరంలో గుడ్ కొలెస్ట్రాల్‌ పెంచే ఆహారాలు ఇవే.. అస్సలు మిస్ చేయండి
శరీరంలో గుడ్ కొలెస్ట్రాల్‌ పెంచే ఆహారాలు ఇవే.. అస్సలు మిస్ చేయండి
సమ్మర్‌లో 2 రోజుల చిరపుంజి టూర్‌ ట్రిప్‌.. తక్కువ బడ్జెట్‌లోనే!
సమ్మర్‌లో 2 రోజుల చిరపుంజి టూర్‌ ట్రిప్‌.. తక్కువ బడ్జెట్‌లోనే!
ఉద్యోగం చేస్తూనే ఇంట్లో వ్యాపారం.. నెల రోజుల్లోనే ఆదాయం ప్రారంభం
ఉద్యోగం చేస్తూనే ఇంట్లో వ్యాపారం.. నెల రోజుల్లోనే ఆదాయం ప్రారంభం
బీజేపీ అందుకే 400 సీట్లు కావాలని అంటోంది: రేవంత్ సంచలన వ్యాఖ్యలు
బీజేపీ అందుకే 400 సీట్లు కావాలని అంటోంది: రేవంత్ సంచలన వ్యాఖ్యలు
చల్లదనం కోసం వేసవిలో స్విమ్మింగ్ చేస్తున్నారా.. ఈ విషయాలు మీకోసమే
చల్లదనం కోసం వేసవిలో స్విమ్మింగ్ చేస్తున్నారా.. ఈ విషయాలు మీకోసమే
రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.