వరుసగా రెండు మ్యాచ్‌ల్లో డకౌట్‌ అయిన ధావన్‌

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ అంటేనే సంచలనాలమయం.. కొత్త రికార్డులు పుట్టకొచ్చే సందర్భం.. ఢిల్లీ క్యాపిటల్స్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్ వరుసగా రెండు సెంచరీలు సాధించి రికార్డు సృష్టించాడు కదా! మళ్లీ ఆయనే వరుసగా రెండు సున్నాలు చుట్టి మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.. చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ కొట్టిన ధావన్‌ ఆ తర్వాత కింగ్స్‌ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ శతక్కొట్టాడు.. అసలు ఇప్పటి వరకు ఐపీఎల్‌లో ఇలా వరుసగా రెండు సెంచరీలు […]

వరుసగా రెండు మ్యాచ్‌ల్లో డకౌట్‌ అయిన ధావన్‌
Balu

|

Oct 31, 2020 | 5:30 PM

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ అంటేనే సంచలనాలమయం.. కొత్త రికార్డులు పుట్టకొచ్చే సందర్భం.. ఢిల్లీ క్యాపిటల్స్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్ వరుసగా రెండు సెంచరీలు సాధించి రికార్డు సృష్టించాడు కదా! మళ్లీ ఆయనే వరుసగా రెండు సున్నాలు చుట్టి మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.. చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ కొట్టిన ధావన్‌ ఆ తర్వాత కింగ్స్‌ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ శతక్కొట్టాడు.. అసలు ఇప్పటి వరకు ఐపీఎల్‌లో ఇలా వరుసగా రెండు సెంచరీలు సాధించనవారే లేరు.. అలాంటి ధావన్‌ ఇప్పుడు వరుసగా రెండుసార్లు డకౌట్‌ అయ్యాడు.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో సందీప్‌ శర్మ వేసిన తొలి ఓవర్‌ మూడో బంతికి ధావన్‌ పరుగులేమి చేయకుండా అవుటయ్యాడు కదా! ఇవాళ ముంబాయి ఇండియన్స్‌లో జరిగిన మ్యాచ్‌లోనూ అలాగే అవుటయ్యాడు.. ట్రెంట్‌ బౌల్డ్‌ వేసిన మొదటి ఓవర్‌ మూడో బంతికి పరుగుల ఖాతా ఆరంభించడానికి ముందే పెవిలియన్‌కు చేరుకున్నాడు. డ్రైవ్‌ షాట్‌ ఆడేందుకు ప్రయత్నించి బ్యాక్‌వర్డ్‌ పాయింట్‌లో ఉన్న సూర్యకుమార్‌ యాదవ్‌కు క్యాచ్‌ ఇచ్చాడు.. అయితే ఆ అవుట్‌పై కొంచెం అనుమానాలు ఉండటంతో థర్డ్‌ అంపైర్‌కు రిఫర్‌ చేశారు.. థర్డ్‌ అంపైర్‌ జాగ్రత్తగా చూసి అవుట్‌గా ప్రకటించాడు.. ఇలా వరుసగా రెండు సెంచరీలు, రెండు సున్నాలు చేసిన ఆటగాడు ధావన్‌ ఒక్కరేనేమో! అన్నట్టు రెండు సెంచరీలు చేసిన తర్వాత కోలక్‌తా నైట్‌ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆరు పరుగులు చేశాడు.. అంటే గత మూడు మ్యాచులలో ధావన్‌ చేసిన పరుగులు ఆరే అన్నమాట!

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu