ఐపీఎల్ 2020: అదరగొట్టిన ముంబై బౌలర్లు.. చతికిలబడిన ఢిల్లీ..

ఐపీఎల్ 13వ సీజన్‌లో భాగంగా దుబాయ్ వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ స్వల్ప స్కోర్‌కే ఇన్నింగ్స్‌ను ముగించింది.

  • Ravi Kiran
  • Publish Date - 5:23 pm, Sat, 31 October 20
ఐపీఎల్ 2020: అదరగొట్టిన ముంబై బౌలర్లు.. చతికిలబడిన ఢిల్లీ..

IPL 2020: ఐపీఎల్ 13వ సీజన్‌లో భాగంగా దుబాయ్ వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ స్వల్ప స్కోర్‌కే ఇన్నింగ్స్‌ను ముగించింది. లీగ్ స్టేజిలో కీలకమైన మ్యాచ్‌లో ముంబై బౌలర్ల ధాటికి ఢిల్లీ బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. తక్కువ పరుగులకే వరుసగా పెవిలియన్ క్యూ కట్టారు. దీనితో నిర్ణీత 20 ఓవర్లకు ఢిల్లీ 9 వికెట్ల నష్టానికి 110 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాట్స్‌మెన్ ఒక్కరు కూడా 30 పరుగులు చేయలేకపోవడం గమనార్హం. ఇక ముంబై బౌలర్లలో బౌల్ట్, బుమ్రా మూడేసి వికెట్లు పడగొట్టగా.. కౌల్టర్‌నైల్, రాహుల్ చాహార్‌లు చెరో వికెట్ తీశారు.