Murder: సలాడ్ లేటయ్యిందని భార్యను చంపిన భర్త.. కుమారుడిపై కూడా కొడవలితో దాడి..
Man kills wife: దేశంలో ఇటీవల కాలంలో అరాచకలు ఎక్కువయ్యాయి. కొంతమంది మృగల్లా ప్రవర్తిస్తూ దాడులకు పూనుకుంటున్నారు. భోజనంలో సలాడ్ అందించడం
Man kills wife: దేశంలో ఇటీవల కాలంలో అరాచకలు ఎక్కువయ్యాయి. కొంతమంది మృగల్లా ప్రవర్తిస్తూ దాడులకు పూనుకుంటున్నారు. భోజనంలో సలాడ్ అందించడం ఆలస్యమైందని భర్త తన భార్య దాడి చేసి హత్య చేశాడు. దీంతోపాటు 22 ఏళ్ల కుమారుడిని తీవ్రంగా కొట్టి గాయ పర్చాడు. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్‌లో కలకలం సృష్టించింది. షామ్లి జిల్లా గోగవన్ జలాల్‌పూర్‌లో ఈ ఘటన మంగళవారం చోటుచేసుకుంది. ఈ ఘటన జరిగిన అనంతరం నిందితుడు పరారయ్యాడు. ప్రస్తుతం అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలు..
మురళి కుమార్ (45), సుదేశ్ భార్యాభర్తలు. భార్య రాత్రి వేళ భోజనంలో పండ్ల సలాడ్ అందిస్తుండేది. సోమవారం రాత్రి తాగి వచ్చి మురళి సలాడ్ ఇవ్వాలని భార్యను అడిగాడు. అయితే ఆమె వేరే పనిలో ఉండి సలాడ్ ఇవ్వడం ఆలస్యమైంది. దీంతో ఆగ్రహానికి గురైన మురళి భార్యతో గొడవపడ్డాడు. అనంతరం ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. అకస్మాత్తుగా అర్ధరాత్రి వచ్చిన మురళి కొడవలి తీసుకుని భార్యపై విచక్షణ రహితంగా దాడి చేసి చంపాడు. అడ్డుకోబోయిన కుమారుడిపై కూడా దాడి చేశాడు. అతనికి తీవ్ర గాయాలపాలయ్యాయి.
అనంతరం నిందితుడు మురళి అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రక్తపు మడుగులో ఉన్న సుదేశ్, ఆమె కుమారుడిని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే సుదేష్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కుమారుడు ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: