కాంగ్రెస్ ఘోర పరాజయం.. రాజ్‌బబ్బర్ రాజీనామా
గురువారం వెల్లడైన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఒకప్పుడు ఆ రాష్ట్రంలో బలంగా ఉన్న కాంగ్రెస్.. క్రమేపి తగ్గుతూ.. ఈ ఎన్నికల్లో కేవలం ఒక స్థానానికే పరిమితమైంది. ఈ ఓటమికి బాధ్యత వహిస్తూ.. ఆ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్, నటుడు రాజ్ బబ్బర్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి పంపారు. కాగా 80 లోక్‌సభ స్థానాలున్న యూపీలో బీజేపీ […]
గురువారం వెల్లడైన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఒకప్పుడు ఆ రాష్ట్రంలో బలంగా ఉన్న కాంగ్రెస్.. క్రమేపి తగ్గుతూ.. ఈ ఎన్నికల్లో కేవలం ఒక స్థానానికే పరిమితమైంది. ఈ ఓటమికి బాధ్యత వహిస్తూ.. ఆ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్, నటుడు రాజ్ బబ్బర్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి పంపారు.
కాగా 80 లోక్‌సభ స్థానాలున్న యూపీలో బీజేపీ 62, బీఎస్పీ 10, ఎస్పీ 5 స్థానాల్లో విజయం సాధించింది. కేవలం రాయ్‌బరేలిలో మాత్రమే యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ విజయం సాధించారు. మరోవైపు ఫతేపూర్ సిక్రీ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన రాజ్ బబ్బర్, బీజేపీ అభ్యర్థి రాజ్ కుమార్ చహార్ చేతిలో ఓడిపోయారు.