అగ్రనేతల ఆశీస్సులు తీసుకున్న మోదీ, షా

సార్వత్రిక ఎన్నికల్లో సాధించిన అఖండ విజయంతో కమల దళం ఫుల్ జోష్‌లో ఉంది. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఇవాళ కూడా సంబరాలు జరుపుకుంటున్నారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాలు పార్టీ అగ్రనేతలైన అద్వాణీ, మురళీ మనోహర్ జోషిలను కలిసి వారి ఆశీస్సులను తీసుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. బీజేపీ నేడు విజయం సాధించిందంటే ఇటువంటి గొప్ప వ్యక్తులు దశాబ్దాల తరబడి పార్టీ పటిష్టతకు వేసిన పునాది వల్లే సాధ్యమైందంని.. […]

  • Tv9 Telugu
  • Publish Date - 12:15 pm, Fri, 24 May 19
అగ్రనేతల ఆశీస్సులు తీసుకున్న మోదీ, షా

సార్వత్రిక ఎన్నికల్లో సాధించిన అఖండ విజయంతో కమల దళం ఫుల్ జోష్‌లో ఉంది. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఇవాళ కూడా సంబరాలు జరుపుకుంటున్నారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాలు పార్టీ అగ్రనేతలైన అద్వాణీ, మురళీ మనోహర్ జోషిలను కలిసి వారి ఆశీస్సులను తీసుకున్నారు.

ఈ సందర్భంగా ప్రధాని ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. బీజేపీ నేడు విజయం సాధించిందంటే ఇటువంటి గొప్ప వ్యక్తులు దశాబ్దాల తరబడి పార్టీ పటిష్టతకు వేసిన పునాది వల్లే సాధ్యమైందంని.. ప్రజలకు సైద్ధాంతిక కథనాలను వివరించారంటూ ట్వీట్ చేశారు. డా. మురళి మనోహర్ జోషి గొప్ప పండితుడు.. మేథోసంపత్తి కలిగిన వ్యక్తి అంటూ మరో ట్వీట్ చేశారు. జోషి తోడ్పాటు భారతీయ విద్యా ఉన్నతికి ఎంతో దోహదపడిందని.. బీజేపీని బలోపేతం చేసేందుకు ఎల్లప్పుడు పనిచేశారని.. నాలాంటి ఎంతోమంది కార్యకర్తలకు మార్గదర్శకుడిగా నిలిచారని ప్రధాని పేర్కొన్నారు.