నామినేష‌న్ దాఖలు చేసిన కేంద్ర మంత్రులు

న్యూ ఢిల్లీ : కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్‌, రాజ్య‌వ‌ర్థ‌న్ సింగ్ రాథోడ్ ఇవాళ నామినేష‌న్ దాఖ‌లు చేశారు. కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌.. ఉత్తరప్రదేశ్‌లోని ల‌క్నో లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఉద‌యం లక్నోలో బీజేపీ నేతలతో కలిసి రోడ్‌ షోగా వెళ్లి రాజ్‌నాథ్‌సింగ్‌ తన నామినేషన్‌ దాఖలు చేశారు. రోడ్‌ షోలో భారీ సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక కేంద్ర క్రీడా శాఖ మంత్రి రాజ్య‌వ‌ర్థ‌న్‌ సింగ్ రాథోడ్.. […]

నామినేష‌న్ దాఖలు చేసిన కేంద్ర మంత్రులు
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Apr 16, 2019 | 2:38 PM

న్యూ ఢిల్లీ : కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్‌, రాజ్య‌వ‌ర్థ‌న్ సింగ్ రాథోడ్ ఇవాళ నామినేష‌న్ దాఖ‌లు చేశారు. కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌.. ఉత్తరప్రదేశ్‌లోని ల‌క్నో లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఉద‌యం లక్నోలో బీజేపీ నేతలతో కలిసి రోడ్‌ షోగా వెళ్లి రాజ్‌నాథ్‌సింగ్‌ తన నామినేషన్‌ దాఖలు చేశారు. రోడ్‌ షోలో భారీ సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక కేంద్ర క్రీడా శాఖ మంత్రి రాజ్య‌వ‌ర్థ‌న్‌ సింగ్ రాథోడ్.. రాజ‌స్థాన్‌లోని జైపూర్ నియోజక‌వ‌ర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఉదయం భార్య గాయత్రీ రాథోడ్, యోగా గురువు రాందేవ్ బాబాతో కలిసి వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు.