నలుగురు రైల్వే ఉద్యోగులపై “మోదీ” వేటు
ఉత్తరప్రదేశ్ : ప్రధాని మోదీ ఫోటో ఉన్న రైలు టికెట్లను విక్రయించవద్దని ఈసీ ఆదేశించినా.. దాన్ని లెక్కచేయకుండా మోదీ చిత్రంతో ఉన్న రైలు టికెట్లను విక్రయించారు. ఈ ఘటన యూపీలోని బారాబంకి రైల్వే స్టేషన్లో వెలుగుచూసింది. ఈ నెల 13వ తేదీన ఈ రైల్వే స్టేషన్ బుకింగ్ కౌంటర్‌లోని ఉద్యోగులు.. ప్రధాని మోదీ చిత్రం ఉన్న రైలు టికెట్లను అమ్మడం దుమారం రేపింది. దీనిపై ప్రయాణికుల నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు రైల్వే ఉన్నతాధికారులు దర్యాప్తు చేపట్టారు. […]
ఉత్తరప్రదేశ్ : ప్రధాని మోదీ ఫోటో ఉన్న రైలు టికెట్లను విక్రయించవద్దని ఈసీ ఆదేశించినా.. దాన్ని లెక్కచేయకుండా మోదీ చిత్రంతో ఉన్న రైలు టికెట్లను విక్రయించారు. ఈ ఘటన యూపీలోని బారాబంకి రైల్వే స్టేషన్లో వెలుగుచూసింది. ఈ నెల 13వ తేదీన ఈ రైల్వే స్టేషన్ బుకింగ్ కౌంటర్‌లోని ఉద్యోగులు.. ప్రధాని మోదీ చిత్రం ఉన్న రైలు టికెట్లను అమ్మడం దుమారం రేపింది. దీనిపై ప్రయాణికుల నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు రైల్వే ఉన్నతాధికారులు దర్యాప్తు చేపట్టారు. పొరపాటున పాత టికెట్ల రోల్‌ను వినియోగించారని రైల్వే ఉన్నతాధికారుల దర్యాప్తులో తేలింది. దీంతో దీనికి కారణమైన మొత్తం నలుగురు ఉద్యోగులను సస్పెండ్ చేశామని రైల్వే అదనపు డివిజనల్ మేనేజర్ తెలిపారు.