Telangana: ‘అప్పులు తెస్తే తప్ప తెలంగాణ ప్రభుత్వం నడవదు’.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
తెలంగాణలో ప్రజాస్వామ్య పద్దతిలో పనిచేసే ప్రభుత్వం రావాలని కాంక్షించారు కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి. ప్రజల అవసరాలు తీర్చి, వారి కష్టసుఖాల్లో భాగస్వామ్యులయ్యే నాయకులు కావాలన్నారు. రాష్ట్రంలోని డబుల్ బెడ్ రూం ఇళ్లపై పంచ్‌లు వేశారు. బీసీ ముఖ్యమంత్రిని చేయడమే పార్టీ విధానమని.. తాను ఎన్నికల పోటీలో ఉంటే తప్పుడు సంకేతాలు వెళతాయంటూ కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. అందుకే తాను అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదంటూ స్పష్టం చేశారు.

ప్రస్తుతం అప్పులు చేస్తే తప్ప తెలంగాణలో ప్రభుత్వం నడిచే పరిస్థితి లేదన్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పిన పాలకులు.. దానిని అమలు చేయడంలో తీవ్ర జాప్యం ఏర్పడిన కారణంగా నిరుద్యోగులు, యువత నిరాశలో ఉన్నట్లు చెప్పారు. రైతుల రుణమాఫీపై ప్రభుత్వాన్ని విమర్శించారు. బీజేపీ దేశవ్యాప్తంగా నాలుగు కోట్ల ఇళ్లు కట్టిందని చెప్పారు. పక్కరాష్ట్రాల్లో కూడా 20లక్షల ఇళ్లు నిర్మించామన్నారు. తెలంగాణలో అధికారంలోకి వస్తే పక్కరాష్ట్రాల్లో కట్టిన విధంగానే ఇక్కడ కూడా ఇళ్లు నిర్మించి పేదవాడికి ఇస్తామని హామీ ఇచ్చారు. నీతివంతమైన ప్రభుత్వాన్ని ఇస్తామనారు. తమ మ్యానిఫెస్టోలో ప్రకటించిన ప్రతీ హామీ ప్రొడక్టవిటీని అందించేలా రూపొందించామని వెల్లడించారు.
కిషన్ రెడ్డి పూర్తి వీడియో..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..