AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rahul Gandhi: రాహుల్ గాంధీకి ఎన్నికల సంఘం షోకాజ్ నోటీసు.. రెండు రోజుల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశం

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై పనౌటీ మోదీ అంటూ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. రాహుల్ గాంధీకి షోకాజ్ నోటీసు జారీ చేసింది ఈసీ. పనౌటీ పద ప్రయోగం ద్వారా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు, జేబుదొంగ అంటూ ప్రకటనలు చేసినందుకు సమాధానం కోరింది ఈసీ. నవంబర్ 25 సాయంత్రం 6గంటలలోపు సమాధానం ఇవ్వాలని సూచించింది.

Rahul Gandhi: రాహుల్ గాంధీకి ఎన్నికల సంఘం షోకాజ్ నోటీసు..  రెండు రోజుల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశం
Eci On Rahul Gandhi
Balaraju Goud
|

Updated on: Nov 23, 2023 | 5:28 PM

Share

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై పనౌటీ మోదీ అంటూ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. రాహుల్ గాంధీకి షోకాజ్ నోటీసు జారీ చేసింది ఈసీ. పనౌటీ పద ప్రయోగం ద్వారా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు, జేబుదొంగ అంటూ ప్రకటనలు చేసినందుకు సమాధానం కోరింది ఈసీ. నవంబర్ 25 సాయంత్రం 6గంటలలోపు సమాధానం ఇవ్వాలని సూచించింది.

నవంబర్ 22వ తేదీన కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై బీజేపీ ఎన్నికల కమిషన్‌లో ఫిర్యాదు చేసింది. ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాహుల్‌పై చర్య తీసుకోవాలని డిమాండ్ చేసింది. భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి రాధా మోహన్ దాస్ అగర్వాల్, మరో నేత ఓం పాఠక్ సహా ప్రతినిధి బృందం రాహుల్ గాంధీ ప్రకటనను అవమానకరమైనదిగా పేర్కొంటూ ఈసీని ఆశ్రయించారు.

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీల వ్యాఖ్యలు అసత్యాలను వ్యాప్తి చేస్తున్నాయని, వారి ప్రవర్తన నైతిక ప్రమాణాలను ఉల్లంఘిస్తున్నందున వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు బీజేపీ నేతలు. ఎన్నికల చట్టాలు, మోడల్ ప్రవర్తనా నియమావళికి సంబంధించిన మార్గదర్శకాలతోపాటు విలువలకు గౌరవం లేదని తెలిపారు.

వాస్తవానికి, ప్రపంచకప్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో భారత క్రికెట్ జట్టు ఓడిపోయింది. ఆ తర్వాత రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై పనౌటీ అనే పదాన్ని ఉపయోగించారు. నవంబర్ 21వ తేదీన రాజస్థాన్‌లోని బలోత్రాలో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ప్రసంగించిన రాహుల్ గాంధీ.. భారత్‌ ఓటమికి ఓ అపశకునమే కారణమని ప్రధాని నరేంద్రమోదీని ఉద్దేశించి రాహుల్‌గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్‌-ఆస్ట్రేలియా మధ్య ఫైనల్ మ్యాచ్‌ను వీక్షించేందుకు వచ్చిన వాళ్లలో ఓ అపశకునం ఉన్నదని, ఆ అపశకునం వల్లనే భారత్‌ మ్యాచ్‌ ఓడిపోయిందని రాహుల్‌గాంధీ వ్యాఖ్యానించారు.

రాహుల్‌గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ శ్రేణులు భగ్గుమన్నాయి. రాహుల్‌ వెంటనే క్షమాపణ చెప్పాలని ఆ పార్టీ నేతలు డిమాండ్‌ చేశారు. గెలుపు , ఓటమిలు ఆటలో సహజమని , భారత జట్టులో ఆత్మవిశ్వాసం నింపేందుకు వెళ్లిన ప్రధాని మోదీని రాహుల్‌గాంధీ ఇలా విమర్శించడం దారుణమన్నారు. గతంలో మోదీపై సోనియాగాంధీ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికి కూడా ఫలితం అనుభవిస్తోందని, ఇప్పుడు రాహుల్‌గాంధీ వ్యాఖ్యలకు తప్పకుండా ఆ పార్టీకి మరోసారి భంగపాటు తప్పదన్నారు. అయితే రాహుల్‌గాంధీ మోదీపై చేసిన వ్యాఖ్యలు చిచ్చు రేపాయి. ఈ నేపథ్యంలోనే రాహుల్ గాంధీకి ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…