SBI PO Prelims Exam: ఎస్‌బీఐ పీవో ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల.. వెబ్‌సైట్ మెయిన్స్ హాల్ టికెట్లు
దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) శాఖల్లో ప్రొబేషనరీ ఆఫీసర్ల నియమకాలకు సంబంధించి కంప్యూటర్ ఆధారిత ప్రిలిమ్స్ రాత పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్ష ఫలితాలను తాజాగా ఎస్‌బీఐ విడుదల చేసింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు పొందుపరిచి ఫలితాలు తెలుసుకోవచ్చు. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన వారు మెయిన్స్ పరీక్ష రాయడానికి అర్హులు. డిసెంబర్ 5న మెయిన్స్ జరగనుంది. ఈ నోటిఫికేషన్
న్యూఢిల్లీ, నవంబర్ 23: దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) శాఖల్లో ప్రొబేషనరీ ఆఫీసర్ల నియమకాలకు సంబంధించి కంప్యూటర్ ఆధారిత ప్రిలిమ్స్ రాత పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్ష ఫలితాలను తాజాగా ఎస్‌బీఐ విడుదల చేసింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు పొందుపరిచి ఫలితాలు తెలుసుకోవచ్చు. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన వారు మెయిన్స్ పరీక్ష రాయడానికి అర్హులు. డిసెంబర్ 5న మెయిన్స్ జరగనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 2,000 పీవో పోస్టులను భర్తీ చేయనున్నారు.
కాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో భర్తీ చేయనున్న పీవో పోస్టులను ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, మెయిన్ ఎగ్జామినేషన్, సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ ఎక్సర్‌సైజ్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారనే సంగతి తెలసిందే. అన్ని స్టేజులు దాటి ఎంపికైన అభ్యర్థులు దేశ వ్యాప్తంగా ఉన్న ఎస్‌బీఐ బ్రాంచుల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఎంపికైన వారికి ప్రతి నెలా రూ.41,960 జీతంగా చెల్లిస్తారు.
నీట్ యూజీ పరీక్షల్లో అర్హత ప్రమాణాల సవరణ చేసిన NMC
నీట్ యూజీ పరీక్షల్లో అర్హత ప్రమాణాల సవరిస్తూ జాతీయ వైద్య మండలి బుధవారం (నవంబరు 22) ప్రకటన వెలువరించింది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ లేదా బయో టెక్నాలజీతో పాటు అదనపు సబ్జెక్టుగా ఇంగ్లిషును కూడా చేర్చింది. అలాగే 12వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు మాత్రమే నీట్-యూజీ పరీక్షకు అర్హులవుతారని జాతీయ వైద్య మండలి (ఎన్‌ఎంసీ) జారీ చేసిన ఉత్తర్వుల్లో ఈ మేరకు పేర్కొంది. గతంలో దరఖాస్తుల తిరస్కరణకు గురైన విద్యార్థులకు కూడా ఈ నిర్ణయం వర్తిస్తుందని తాజా ఉత్తర్వల్లో స్పష్టం చేసింది. అయితే నీట్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా 11, 12 తరగతుల్లో రెండేళ్లు ఇంగ్లిషుతో పాటు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టులను క్రమం తప్పకుండా అధ్యయనం చేసి ఉండాలని ఎన్‌ఎంసీ పరిధిలోని అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డు నోటీసులో పేర్కొంది.
నీట్-యూజీ సిలబస్ తగ్గింపు
నీట్-యూజీలో సిలబస్‌ను తగ్గిస్తున్నట్లు జాతీయ పరీక్ష మండలి (ఎన్‌టీఏ) స్పష్టం చేసింది. సీబీఎస్‌ఈ పాఠ్యాంశాల్లో జరిగిన మార్పులకు అనుగుణంగా నీట్-యూజీ పరీక్ష లోనూ సిలబస్‌ను హేతుబద్ధీకరించినట్లు వెల్లడించింది. వచ్చే ఏడాది మే 5వ తేదీన నిర్వహించే పరీక్షకు తగ్గించిన సిలబస్‌తోపాటు, సవరణ నిబంధనలు వర్తిస్తాయని ఈ ప్రకటించింది. కొత్త సిలబస్‌ను నీట్ వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చని విద్యార్థులు, కాలేజీలకు సూచించింది.
ఆ హిందీ కోర్సులు డిగ్రీతో సమానం కాదంటూ తెలంగాణ విద్యాశాఖ ఉత్తర్వులు
హిందీ విద్వాన్, మాధ్యమ, విశారద కోర్సులు డిగ్రీతో సమానం కాదని విద్యాశాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. దేశంలోని వివిధ హిందీ బోధనా సంస్థల నుంచి పూర్తి చేసిన ఈ కోర్సులు డిగ్రీతో సమానం కాదని విద్యాశాఖ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. తాజాగా దీనిపై వివరణ కోరుతూ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా విద్యాశాఖ ఈ ఉత్తర్వులు జారీ చేసింది.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.