HiPhi A Electric Car: హైప్ క్రియేట్ చేస్తున్న హైఫై ఏ ఎలక్ట్రిక్ కార్.. లుక్ చూస్తే కళ్లు జిగేల్.. గంటకు 300 కిలోమీటర్ల వేగం..
చైనాకు చెందిన హైఫై అనే కంపెనీ ఓ కొత్త లగ్జరీ సెడాన్ ఎలక్ట్రిక్ కారును గ్లోబల్ వైడ్ గా లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. దీని పేరు హై ఫై ఏ. దీనిలో ప్రత్యేకత ఎంటంటే ఇది లగ్జరీ మోడల్, హై స్పీడ్ సెడాన్. ఇది కేవలం రెండు సెకండ్లలోనే సున్నా నుంచి 96 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలుగుతుంది. అలాగే గరిష్టంగా గంటకు 300కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలుగుతుందని ఆ కంపెనీ ప్రకటించుకుంది.
చైనా ఎలక్ట్రిక్ వాహనాలకు ఒక హబ్‌లా మారుతోంది. అత్యాధునిక సాంకేతికతో, అధిక రేంజ్ కలిగిన కార్లు, బైక్లు, స్కూటర్లు అక్కడ లాంచ్ అవుతున్నాయి. పలు టాప్ రేటెడ్ కంపెనీలు తమ ఉత్పత్తులను పోటాపోటీగా లాంచ్ చేస్తున్నాయి. వాటిల్లో కొన్ని అనువైన బడ్జెట్లో ఉంటుండగా.. మరికొన్ని హై ఎండ్ లగ్జరీ కార్లు కూడా ఉంటున్నాయి. మరికొన్ని అధిక సామర్థ్యం కలిగిన బ్యాటరీలతో రేంజ్, పనితీరుల్లో తిరుగులేని విధంగా ఉంటున్నాయి. ఇదే క్రమంలో చైనాకు చెందిన హైఫై అనే కంపెనీ ఓ కొత్త లగ్జరీ సెడాన్ ఎలక్ట్రిక్ కారును గ్లోబల్ వైడ్ గా లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. దీని పేరు హై ఫై ఏ. దీనిలో ప్రత్యేకత ఎంటంటే ఇది లగ్జరీ మోడల్, హై స్పీడ్ సెడాన్. ఇది కేవలం రెండు సెకండ్లలోనే సున్నా నుంచి 96 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలుగుతుంది. అలాగే గరిష్టంగా గంటకు 300కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలుగుతుందని ఆ కంపెనీ ప్రకటించుకుంది. ఈ కొత్త ఎలక్ట్రిక్ కారుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
హైఫై ఏ ఎలక్ట్రిక్ సెడాన్..
ఈ కంపెనీ నుంచి 2023లో మార్కెట్లోకి వచ్చిన హైఫై జెడ్ ఈవీ ఆధారంగానే ఈ కొత్త కారు రూపొందింది. అందులో వాడిన ఎయిర్ సస్పెన్షన్ సిస్టమ్, హైఫై ఏలోనూ ఇచ్చింది. రేర్ స్టీరింగ్ సెటప్, అడాప్టివ్ డాంపర్స్, టార్క్ వెక్టరింగ్ సస్టమ్ వంటివి ఈ కారులో ఉన్నాయి. త్వరలో జరగనున్న గంగ్జౌ ఆటో షోలో దీనిని పూర్తి స్థాయిలో ప్రదర్శించే అవకాశం ఉంది. ఈ ఎలక్ట్రిక్ సెడాన్ లో 1,270 బీహెచ్ పీ పీక్ పవర్ ను ఉత్పత్తి చేసే ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ వ్యవస్థ ఉంటుంది. ఇది అందించే శక్తి ద్వారా ఇది గంటకు గరిష్టంగా 300 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలుగుతుంది. అలాగే యాక్సెసరేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. కేవలం రెండు సెకండ్లలోనే సున్నా నుంచి 96 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలుగుతుంది. 2025లో ఇది ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
సొంతంగా తయారు చేసిన మోటార్..
హైఫై కంపెనీ ఈ ఎలక్ట్రిక్ కారు కోసం తనే ఎలక్ట్రిక్ మోటార్ లను తయారు చేసినట్లు ప్రకటించింది. ఈ హైఫై ఏ ఎలక్ట్రిక్ సెడాన్లో మూడు ఎలక్ట్రిక్ మోటార్ లు ఉంటాయని కంపెనీ పేర్కొంది. ముందు వైపు యాక్సిల్ వద్ద ఒకటి. వెనుకవైపు యాక్సిల్ వద్ద రెండు ఫిట్ చేసి ఉంటాయని వివరించింది. బ్యాటరీ స్పెసిఫికేషన్లు ఇంకా కంపెనీ వెల్లడించలేదు. విధంగా
డిజైన్ అండ్ లుక్..
ఈ కొత్త హైఫై ఏ సెడాన్ కారు డిజైన్ పరిశీలస్తే నిస్సాన్ జీటీ ఆర్ సూపర్ కారును పోలి ఉంది. పూర్తి ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్. ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్స్ ఉంటాయి. ముందు వైపు భారీగా గ్రిల్ కూడా కనిపిస్తుంది. సాధారణంగా ఇలాంటి భారీ గ్రిల్స్ ఎలక్ట్రిక్ కార్లకు ఉండవు. అల్లాయ్ వీల్స్ కూడా ఉన్నాయి. దీనికి సంబంధించిన ఇతర లగ్జరీ ఫీచర్లు, ధర, లభ్యత వంటి పూర్తి వివరాలు కంపెనీ ఇంకా ప్రకటించలేదు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..