AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొత్త ఎలక్ట్రానిక్స్ పాలసీకి కే౦ద్ర కేబినెట్‌ పచ్చజె౦డా

కొత్త ఎలక్ట్రానిక్స్‌ పాలసీకి కేంద్ర కేబినెట్‌ మంగళవారం పచ్చజెండా ఊపింది. భారత్‌లో తయారయ్యే ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల విలువను 2025 నాటికి 400 బిలియన్‌ డాలర్లకు తీసుకెళ్లడమే లక్ష్యంగా కేంద్రం ఈ పాలసీకి ఆమోదముద్ర వేసింది. ప్రస్తుతం వీటి విలువ 79 బిలియన్ డాలర్ల సమీపంలో ఉంది. కొత్త పాలసీ వల్ల కోటి మందికి ఉపాధి లభిస్తుందని కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ తెలిపారు. ఎలక్ట్రానిక్స్ ప్లాంటు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఇతర ఫెసిలిటీల […]

కొత్త ఎలక్ట్రానిక్స్ పాలసీకి కే౦ద్ర కేబినెట్‌ పచ్చజె౦డా
Celestica employees work at a production line in a factory in Dongguan, China's southern Guangdong province, July 29, 2009. Contract electronics manufacturer Celestica Inc reported a lower second-quarter profit last Thursday, partly due to costs related to job cuts, and said it planned to spend more on restructuring this year. REUTERS/Tyrone Siu (CHINA BUSINESS POLITICS)
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 07, 2019 | 6:51 PM

Share

కొత్త ఎలక్ట్రానిక్స్‌ పాలసీకి కేంద్ర కేబినెట్‌ మంగళవారం పచ్చజెండా ఊపింది. భారత్‌లో తయారయ్యే ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల విలువను 2025 నాటికి 400 బిలియన్‌ డాలర్లకు తీసుకెళ్లడమే లక్ష్యంగా కేంద్రం ఈ పాలసీకి ఆమోదముద్ర వేసింది. ప్రస్తుతం వీటి విలువ 79 బిలియన్ డాలర్ల సమీపంలో ఉంది. కొత్త పాలసీ వల్ల కోటి మందికి ఉపాధి లభిస్తుందని కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ తెలిపారు.

ఎలక్ట్రానిక్స్ ప్లాంటు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఇతర ఫెసిలిటీల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సాయమందించేలా ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్షరింగ్ క్లస్టర్ స్కీమ్‌ సవరణను ప్రతిపాదించింది. దీంతోపాటు సావరిన్ పేటెంట్ ఫండ్ కూడా ఆవిష్కరించింది. దీంతో చిప్స్ ఐపీలు, చిప్స్ విడిభాగాలు తక్కువ ధరలకు అందుబాటులోకి రావొచ్చు.