అభిమాని కుటు౦బానికి రజనీ భారీ సాయ౦

అభిమాని కుటు౦బానికి రజనీ భారీ సాయ౦

నటనలోనే కాదు.. దాన గుణంలోనూ తనకు తానే సాటి అని మరోసారి నిరూపించుకున్నారు సూపర్‌స్టార్ రజినీకాంత్. రజినీ అభిమాని, ‘రజినీ మక్కల్‌ మండ్రం’ ధర్మపురి జిల్లా కార్యదర్శి మహేంద్రన్‌ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయం తెలిసిన రజినీ అతడి కుటుంబాన్ని ఆదుకుంటామని ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే మహేంద్రన్ కుటుంబసభ్యులు రజినీకాంత్‌ను ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా రజినీ వారికి సంతాపం తెలిపి రజినీ మక్కల్‌ మండ్రం తరఫున రూ.40 లక్షలు, […]

TV9 Telugu Digital Desk

| Edited By: Team Veegam

Feb 14, 2020 | 1:30 PM

నటనలోనే కాదు.. దాన గుణంలోనూ తనకు తానే సాటి అని మరోసారి నిరూపించుకున్నారు సూపర్‌స్టార్ రజినీకాంత్. రజినీ అభిమాని, ‘రజినీ మక్కల్‌ మండ్రం’ ధర్మపురి జిల్లా కార్యదర్శి మహేంద్రన్‌ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయం తెలిసిన రజినీ అతడి కుటుంబాన్ని ఆదుకుంటామని ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే మహేంద్రన్ కుటుంబసభ్యులు రజినీకాంత్‌ను ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా రజినీ వారికి సంతాపం తెలిపి రజినీ మక్కల్‌ మండ్రం తరఫున రూ.40 లక్షలు, తన వంతుగా రూ.10 లక్షలు.. మొత్తం రూ.50లక్షల ఆర్థిక సాయం అందజేశారు. మహేంద్రన్‌ పిల్లల చదువు ఖర్చులను కూడా తానే భరిస్తానని రజినీ ప్రకటించారు.

ఓ అభిమాని కుటుంబానికి రజినీ చేసిన సాయంపై ప్రశంసలు కురుస్తున్నాయి. అభిమానులు అందరికీ ఉంటారని, కానీ రజినీ లాంటి వ్యక్తికి అభిమానులుగా ఉన్నందుకు తామెంతో గర్వపడుతున్నామని ఆయన ఫ్యాన్స్ అంటున్నారు. అభిమానుల అండతో అందలం ఎక్కుతున్న వారు రజినీని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu