Team India: 126 బంతులు, 0 పరుగులు.. క్రికెట్ హిస్టరీలోనే డేంజరస్ గణాంకాలు.. ఎవరో కాదు భయ్యో మనోడే

Cricket Records: ప్రస్తుతం క్రికెట్‌ను టీ20 ఫార్మాట్ ఏలుతోంది. అప్పుడప్పుడు వన్డేలు, టెస్ట్‌లు కూడా ఆసక్తికరంగా మారుతున్నాయి. ఈ క్రమంలో కొన్ని రికార్డులు ఎప్పటికీ చెరిగిపోకుండా ఉంటే, మరికొన్ని మాత్రం క్షణాల్లోనే బద్దలవుతుంటాయి. భారత క్రికెట్ చరిత్రలో ఓ బౌలర్ ఎంతో అద్భుతమైన రికార్డ్ ఒకటి నెలకొల్పాడు. అదేంటో ఓసారి చూద్దామా..

Team India: 126 బంతులు, 0 పరుగులు.. క్రికెట్ హిస్టరీలోనే డేంజరస్ గణాంకాలు.. ఎవరో కాదు భయ్యో మనోడే
Unbreakable Cricket Records
Follow us
Venkata Chari

|

Updated on: Jan 10, 2025 | 1:22 PM

టీ20 ఫార్మాట్ వచ్చాకా బ్యాటర్ల దూకుడు మరింతగా పెరిగింది. బౌలర్లు ఈ ఫార్మాట్‌లో అప్పుడప్పుడు సత్తా చాటుతూ, సరికొత్త రికార్డులు నెలకొల్పుతున్నారు. అయితే, ఏదైనా ఫార్మాట్‌లో మెయిడెన్ ఓవర్ బౌలింగ్ చేయడం అంటే, బౌలర్లకు ఎంతో సంతోషాన్ని అందిస్తుంది. ముఖ్యంగా వన్డేలు, టీ20ల్లో ఇలా మెయిడీన్ చేయడం అంటే మాములు విషయం కాదు. అయితే, ఒక బౌలర్ వరుసగా 21 మెయిడెన్ ఓవర్లు వేశాడని మీకు తెలిస్తే, కచ్చితంగా షాక్ అవుతారు. ఇలాంటి రికార్డును నమ్మడం ఎవరికైనా కష్టమే. క్రికెట్ చరిత్రలో అత్యంత డేంజరస్ బౌలర్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ఆ బౌలర్ ఎవరు? ఎప్పుడు, ఎక్కడ జరిగింది?

టెస్ట్ క్రికెట్ చరిత్రలో భారత క్రికెటర్ బాపు నాదకర్ణి పేరు మీకు తెలుసా. ఈ అద్భుతమైన రికార్డు నమోదు చేసింది ఇతనే. వరుసగా 126 బంతుల్లో ఒక్క పరుగు కోసం బ్యాట్స్‌మెన్స్ తహతహలాడిపోయారు. నాదకర్ణి ఈ రికార్డు 60 ఏళ్లుగా అలాగే ఉండిపోయింది. 1964లో ఇంగ్లండ్ జట్టుపై ఈ ఘనత సాధించి అద్భుతం చేశాడు.

21 మెయిడిన్ ఓవర్లు..

1964లో ఇంగ్లండ్‌తో భారత్ తలపడింది. బాపు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్. ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్స్ పరుగుల కోసం ఎంతో ఇబ్బంది పడ్డారు. మద్రాస్ (చెన్నై) కార్పొరేషన్ స్టేడియంలో ఈ రికార్డ్ నమోదైంది. టెస్ట్ మ్యాచ్‌లో మొత్తం 21 ఓవర్లు, అంటే 126 బంతులు బౌలింగ్ చేశాడు. అందులో ఒక్క పరుగు కూడా రాకపోవడం గమానార్హం. బాపు వేసిన మొత్తం 32 ఓవర్లలో 27 మెయిడిన్లు కాగా, 21 వరుసగా మెయిడిన్లు ఉన్నాయి. 32 ఓవర్ల స్పెల్‌లో బాపు కేవలం 5 పరుగులు మాత్రమే వెచ్చించాడు.

ఇవి కూడా చదవండి

అద్భుతమైన కెరీర్..

టీమిండియా తరపున బాపు 47 టెస్టులు ఆడాడు. 9165 బంతులు బౌల్ చేశాడు. ఇందులో 2559 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అతని పేరిట 88 వికెట్లు ఉన్నాయి. ఈయన టెస్ట్ కెరీర్‌లో ఓవర్‌కు 1.67 చొప్పున పరుగులు ఇచ్చాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..