ఆధార్‌లో మార్పులు చేయాలంటే.. ఇకపై పరిమితులు తప్పవు!

మీ ఆధార్ కార్డులో అంశాలు ఏమైనా తప్పుగా ఉన్నాయా..? వాటిని అప్డేట్ చేసుకోవాలనుకుంటున్నారా.? అయితే జాగ్రత్త ఇప్పుడు భారత విశిష్ట ప్రాధికార గుర్తింపు సంస్థ(ఉడాయ్) ఆధార్ అప్డేట్‌కు కొన్ని ఆంక్షలు విధించింది. మునపటి మాదిరిగా ఎన్నిసార్లు పడితే.. అన్నిసార్లు ఆధార్‌ను ఇప్పుడు అప్డేట్ చేసుకోలేరు. ఇక తాజాగా ఉడాయ్ ప్రకటించిన కొత్త నిబంధనల ప్రకారం పుట్టినతేదీని కేవలం ఒక్కసారి మాత్రమే మార్చుకునేందుకు ఛాన్స్ ఉంటుంది. ఆధార్ జారీ చేసే సమయంలో పేరులో గానీ.. పుట్టిన తేదీలో గానీ […]

ఆధార్‌లో మార్పులు చేయాలంటే.. ఇకపై పరిమితులు తప్పవు!
Follow us
Ravi Kiran

|

Updated on: Nov 12, 2019 | 6:41 PM

మీ ఆధార్ కార్డులో అంశాలు ఏమైనా తప్పుగా ఉన్నాయా..? వాటిని అప్డేట్ చేసుకోవాలనుకుంటున్నారా.? అయితే జాగ్రత్త ఇప్పుడు భారత విశిష్ట ప్రాధికార గుర్తింపు సంస్థ(ఉడాయ్) ఆధార్ అప్డేట్‌కు కొన్ని ఆంక్షలు విధించింది. మునపటి మాదిరిగా ఎన్నిసార్లు పడితే.. అన్నిసార్లు ఆధార్‌ను ఇప్పుడు అప్డేట్ చేసుకోలేరు. ఇక తాజాగా ఉడాయ్ ప్రకటించిన కొత్త నిబంధనల ప్రకారం పుట్టినతేదీని కేవలం ఒక్కసారి మాత్రమే మార్చుకునేందుకు ఛాన్స్ ఉంటుంది.

ఆధార్ జారీ చేసే సమయంలో పేరులో గానీ.. పుట్టిన తేదీలో గానీ ఎలాంటి మార్పులు అవసరంపడినా.. మార్చుకునే సౌలభ్యాన్ని కల్పించారు. అయితే దీన్ని అదునుగా తీసుకుని కొందరు ఆధార్‌ను దుర్వినియోగం చేస్తున్నట్లు ఉడాయ్‌కు ఫిర్యాదులు అందాయి. దీంతో ఆ సంస్థ తక్షణమే కొత్త నిబంధనలను రూపొందించింది. ముఖ్యంగా పేరు, డేట్ అఫ్ బర్త్‌ను ఇష్టమొచ్చినట్లుగా మార్చుకునే వీలు లేకుండా పరిమితులు విధించింది.

మీ పేరులో ఏదైనా తప్పుంటే.. ఇకపై దాన్ని మార్చుకోవడానికి కేవలం రెండు సార్లు మాత్రమే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా పుట్టిన తేదీ, పురుషుడా లేదా మహిళా అన్న విషయంలో సదరు డాక్యుమెంట్స్ చూపించి ఒక్కసారే మార్చుకోవాలి. ఇకపోతే ఆధార్‌లోని డేట్ అఫ్ బర్త్‌ను మార్చుకోవాలంటే దానికి ఖచ్చితంగా బర్త్ సర్టిఫికేట్ ఉండాల్సిందే. మరోవైపు పుట్టినతేదీని మూడేళ్లు తక్కువకు గానీ.. ఎక్కువకు గానీ మార్చుకునేందుకు మాత్రమే అవకాశం ఉంటుంది.

ఇదిలా ఉండగా ఆధార్‌లో మార్పులు నిర్దేశించిన సంఖ్య కంటే ఎక్కువ అయితే.. సదరు వ్యక్తి దగ్గర్లోని ఆధార్ కేంద్రాన్ని సందర్శించి.. మెయిల్ ద్వారా మార్పులకు సంబంధించిన డాక్యుమెంట్స్‌ను ఉడాయ్‌కు పంపించడమే కాకుండా.. ఎందుకు తమ అభ్యర్ధనను అంగీకరించాలో కూడా తెలియజేస్తూ ఓ లేఖ రాయాలి.

అటు ప్రాంతీయ ఆధార్ కేంద్రం కూడా సదరు వ్యక్తి నుంచి పూర్తి ఇన్ఫర్మేషన్ తీసుకోవడమే కాకుండా అదనపు వెరిఫికేషన్‌ను కూడా జరుపుతుంది. ఇక ఉడాయ్‌కు మార్పు కోసం వచ్చిన అభ్యర్ధనలోని నిజానిజాల వెరిఫికేషన్‌కు ప్రత్యేకంగా యంత్రాంగం ఉంటుంది.