ఆ దేశంలో యుద్ధ మరణాలను మించిన కరోనా చావులు..!

ఆ దేశంలో యుద్ధ మరణాలను మించిన కరోనా చావులు..!

చిన్న వైరస్‌..కంటికి కనిపించని సూక్ష్మజీవి. కానీ అగ్రరాజ్యాన్నే కకావికలం చేస్తోంది. ప్రపంచానికే పెద్దన్నలాంటి దేశాన్నే అతలాకుతలం చేస్తోంది. రోజుకో మైలురాయిని అధిగమిస్తూ విధ్వంసం సృష్టిస్తోంది. గతంలో ఉన్న అన్ని రికార్డులను బద్దలుకొడుతోంది. తాజాగా వియత్నాం యుద్ధ మరణాలను కూడా మించిపోయింది. రెండు దశాబ్ధాల పాటు కొనసాగిన వార్‌ కంటే..ఎక్కువ మందిని బలి తీసుకుంది ఆ రక్కసి. కొవిడ్‌ 19 అత్యంత ప్రభావం చూపిన దేశాల్లో మొదటి స్థానంలో ఉంది అగ్రరాజ్యం అమెరికా. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో […]

Ram Naramaneni

|

May 01, 2020 | 10:59 AM

చిన్న వైరస్‌..కంటికి కనిపించని సూక్ష్మజీవి. కానీ అగ్రరాజ్యాన్నే కకావికలం చేస్తోంది. ప్రపంచానికే పెద్దన్నలాంటి దేశాన్నే అతలాకుతలం చేస్తోంది. రోజుకో మైలురాయిని అధిగమిస్తూ విధ్వంసం సృష్టిస్తోంది. గతంలో ఉన్న అన్ని రికార్డులను బద్దలుకొడుతోంది. తాజాగా వియత్నాం యుద్ధ మరణాలను కూడా మించిపోయింది. రెండు దశాబ్ధాల పాటు కొనసాగిన వార్‌ కంటే..ఎక్కువ మందిని బలి తీసుకుంది ఆ రక్కసి. కొవిడ్‌ 19 అత్యంత ప్రభావం చూపిన దేశాల్లో మొదటి స్థానంలో ఉంది అగ్రరాజ్యం అమెరికా. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంలా మారింది ఆ దేశ పరిస్థితి. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో తిరుగులేని ఆ దేశం..సూక్ష్మజీవి చేతిలో ఓడిపోయింది. చిన్న వైరస్సే కదా..ఏం చేస్తుందిలే..అని లైట్‌ తీసుకున్నందుకు పెద్దన్నకే చెమటలు పట్టిస్తోంది.

ఆ మహమ్మారి కోరల నుంచి ఎలా బయటపడాలో అర్థంకాక..హేమాహేమీలే తలలు పట్టుకోవలసిన పరిస్థితి. ప్రాణాంతక కరోనా మహమ్మారి అగ్రరాజ్యాన్ని ఛిన్నాభిన్నం చేసేసింది. 3 నెలల్లోనే సుసంపన్న దేశం కాస్తా పాతాళానికి పడిపోయే పరిస్థితికి దిగజార్చింది. అంతకంతకూ తీవ్ర రూపం దాల్చుతూ నిత్యం ఒక్కో మైలురాయిని దాటుతోంది. 24గంటల్లోనే 25వేల కేసులు..2500 మరణాలతో బీభత్సం సృష్టిస్తోంది. ఇప్పటివరకు 11లక్షల కేసులు..62వేల మరణాలతో ప్రపంచంలోనే అగ్రస్థానంలో కొనసాగుతోంది. వరల్డ్‌వైడ్‌గా ఉన్న కేసుల్లో మూడోశాతం..మరణాల్లో నాలుగోశాతం అమెరికాలోనే ఉన్నాయి. 20ఏళ్ల పాటు వియత్నాంతో జరిగిన యుద్ధంలో కంటే..కరోనా బారిన పడి మరణించిన వారే ఎక్కువగా ఉన్నారు.

అమెరికా అగ్రరాజ్యంగా ఎదగడానికి ఎన్నో కష్ట, నష్టాలను చవి చూసింది. ఆటుపోట్లను ఎదుర్కొంది. క్రమంగా అన్ని రంగాల్లోనూ తిరుగులేని దేశంగా ఆవిర్భవించింది. అమెరికా చరిత్రలో అత్యంత ప్రాధాన్యత ఉన్న ఘట్టం వియత్నాంతో యుద్ధం. ఆ ఘటనలో లెక్కలేనంత ఆస్తి నష్టం జరిగింది. అమెరికా చావు దెబ్బ తింది ఆ వియత్నాం వార్‌లోనే. ఆ యుద్ధంలో అమెరికా సైనికులు పిట్టల్లా రాలిపోయారు. అమెరికా, వియత్నాం మధ్య 1955లో మొదలైన యుద్ధం 1975 వరకు సాగింది. రెండు దశాబ్ధాల్లో సుమారు 58వేల 220మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా కరోనా వైరస్ వల్ల వియత్నాం యుద్ధ సమయంలో కంటే అధిక సంఖ్యలో ప్రాణనష్టాన్ని చవి చూస్తోంది అమెరికా.

వియత్నాంలో రెండు దశాబ్ధాల్లో చనిపోయిన సైనికుల కన్నా..కేవలం మూడు నెలల వ్యవధిలోనే వైరస్​వల్ల మరణించినవారే ఎక్కువగా ఉన్నారు. 1968 నాటి వియత్నాం యుద్ధంలో ప్రతి లక్ష మందిలో 8.5 మంది అమెరికన్లు మరణించగా, కరోనా వైరస్‌ బారిన పడి ప్రతి లక్ష మందిలో 17.6 మంది మరణించారు. 1968, జనవరి 31న అత్యధికంగా 246 మంది అసువులు బాశారు. ఆ సంవత్సరంలో అత్యధికంగా 16,899 మంది మరణించారు. కానీ ఇప్పుడు కరోనా ధాటికి రోజుకు వేల సంఖ్యలో కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. 2017-18లో ఇన్‌ఫ్లూయెంజా మరణాలను కూడా దాటేసిందని..ఆగస్ట్‌ చివరినాటికి మృతుల సంఖ్య దాదాపు 75వేలకు చేరుకుంటుంందని అంచనా వేస్తున్నారు వైద్య నిపుణులు.

ఐతే అమెరికా చరిత్రలో అత్యధిక ప్రాణ నష్టాలను చవిచూసిన ఘటనలుగా సెకండ్‌ వరల్డ్‌ వార్‌, సివిల్‌ వార్‌ను చెప్పుకుంటారు. 1941-45 మధ్య కాలంలో జరిగిన రెండో ప్రపంచ యుద్ధంలో..దాదాపు 2 లక్షల 91వేల మందికి పైనే మృతి చెందారు. ఇక 1861-65మధ్య కాలంలో చోటుచేసుకున్న సివిల్‌ వార్‌లో ..దాదాపు 5లక్షల మంది వరకు చనిపోయారు. దీంతో అగ్రరాజ్యంలో మరణాలలో ఆ రెండు ఘటనలు మొదటి రెండు స్థానాల్లో కొనసాగుతుండగా..కరోనా మూడవ స్థానాన్ని ఆక్రమించింది. అమెరికాలో కొవిడ్ 19 తీవ్రంగా ఉన్న మార్చిలో వైద్య నిపుణులు డాక్టర్‌ ఫౌసీ..దాదాపు లక్ష నుంచి రెండు లక్షల మంది మరణిస్తారని అంచనా వేశారు. ఆ తర్వాత 10 రోజులకు.. మరణాలు 60 వేల లోపే ఉండే అవకాశముందని ప్రకటించారు. కానీ ఇప్పుడు ఈ అంచనాలు కూడా మించిపోయాయి. చూడబోతే రెండో ప్రపంచ యుద్ధ మరణాల సంఖ్యను కూడా దాటేసేలా కనిపిస్తోంది. మరికొన్ని రోజులు ఇలాగే ఉండే పరిస్థితులు మరింత దారుణంగా ఉండే అవకాశముందంటున్నారు విశ్లేషకులు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu