“వ్యాధి నియంత్రణతో పాటు ఎకానమి బ్యాలెన్స్ కూడా అవ‌స‌రం”

కరోనావైర‌స్ ప్ర‌స్తుతం భార‌త్ ను పట్టి పీడిస్తోంది. ముందుగా లాక్ డౌన్ అమ‌లు చేసి జాగ్ర‌త్త‌లు తీసుకున్నా..డ్యామేజ్ మాత్రం భారీగానే ఉంది. ఈ లాక్ డౌన్ కార‌ణంగా దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై ప్ర‌తికూల ప‌రిణామాలు కనిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం ఇండియా ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై ఆర్భీఐ మాజీ గ‌వ‌ర్న‌ర్ దువ్వూరి సుబ్బారావు వెర్ష‌న్ ఏంటి…క‌రోనావైర‌స్ అటాక్ పై ఆయ‌న ఏమంటున్నారు..ఆయ‌న వ్యూ ప్ర‌కారం ఏయే రంగాల‌పై క‌రోనా ఎక్కువ ఎఫెక్ట్ చూపించింది వంటి విష‌యాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.. గత […]

వ్యాధి నియంత్రణతో పాటు ఎకానమి బ్యాలెన్స్ కూడా అవ‌స‌రం
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 01, 2020 | 10:51 AM

కరోనావైర‌స్ ప్ర‌స్తుతం భార‌త్ ను పట్టి పీడిస్తోంది. ముందుగా లాక్ డౌన్ అమ‌లు చేసి జాగ్ర‌త్త‌లు తీసుకున్నా..డ్యామేజ్ మాత్రం భారీగానే ఉంది. ఈ లాక్ డౌన్ కార‌ణంగా దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై ప్ర‌తికూల ప‌రిణామాలు కనిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం ఇండియా ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై ఆర్భీఐ మాజీ గ‌వ‌ర్న‌ర్ దువ్వూరి సుబ్బారావు వెర్ష‌న్ ఏంటి…క‌రోనావైర‌స్ అటాక్ పై ఆయ‌న ఏమంటున్నారు..ఆయ‌న వ్యూ ప్ర‌కారం ఏయే రంగాల‌పై క‌రోనా ఎక్కువ ఎఫెక్ట్ చూపించింది వంటి విష‌యాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

గత ఏడాది నుంచే జీడీపీ రేటు తగ్గుతూ వచ్చింద‌న్న దువ్వూరి సుబ్బారావు..5శాతం జిడిపి పడిపోతే తట్టుకోవడం భారత్ వంటి దేశాలకు కష్టమే అని వ్యాఖ్యానించారు. మే నెలాఖరుకు కూడా వ్యాధి పూర్తిగా తగ్గేలా క‌నిపించ‌డం లేద‌ని..అసలు వ్యాక్సిన్ లేదా మెడిసిన్ వచ్చేవరకు వైర‌స్ వ్యాప్తి ఆగేలా క‌నిపించ‌డంలేద‌న్నారు. వ్యాధి నియంత్రణ చర్యలతో పాటు ప్రజల జీవనోపాధి ఇప్పుడు ముఖ్య‌మైన టాస్క్ గా అభివ‌ర్ణించారు. ద‌శలవారీగా లాక్ డౌన్ ఎత్తేసి ఎకానమీని రిస్టార్ట్ చేసి జీవనోపాధి మెరుగుపరచాలని..లాక్ డౌన్ ఎక్కువకాలం కంటిన్యూ చేయలేమ‌ని పేర్కొన్నారు.

వ్యాధి నియంత్రణతో పాటు ఎకానమి బ్యాలెన్స్ చేస్తూ పాలసీ డెసిషన్ తీసుకోవాలని దువ్వూరి సుబ్బారావు సూచ‌న‌లు చేశారు. 2008 రెసిషన్ టైంలో చైనా ఆర్ధిక వ్యవస్థ బలంగా ఉండి ఆదుకుంద‌ని..కానీ ఇప్పుడు ఆ ప‌రిస్థితి లేద‌న్నారు. అన్ని దేశాల్లో క‌రోనా వీర‌విహారం చేస్తోన్న వేళ‌..అటువంటి ప‌రిస్థితులు సాధ్య‌ప‌డ‌వ‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. వరల్డ్ గ్రోత్ రేట్ 6శాతం పడిపోయిన ప్ర‌స్తుత స‌మ‌యంలో ప్రతి దేశం సొంతంగానే బయటపడేందుకు ప్ర‌య‌త్నించాల‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.

అయితే క‌రోనావైర‌స్ వ్య‌వ‌సాయ రంగంపై ప్ర‌భావం చూప‌లేక‌పోయింద‌ని..రికార్డు దిగుబ‌డి వ‌స్తోంద‌ని.. ఫెడ్ ప్రాసెసింగ్ సప్లై బాగుంద‌ని తెలిపారు. కాకపోతే ఈ మ‌హ‌మ్మారి ఉత్పత్తి రంగం, సర్వీస్ సెక్టార్, రిటైల్, నిర్మాణరంగాల‌ను తీవ్రంగా దెబ్బంతీసింద‌ని పేర్కొన్నారు. ఈ అంటువ్యాధి తర్వాత ప్రజలు ఖర్చు చేయడానికి ఇష్టపడరని, కానీ ఇది ఆర్ధిక వ్యవస్థకు మంచిది కాదని సూచించారు. గ్రోత్ రేటుపై IMF రిపోర్టులు నమ్మలేమ‌ని..వారు జీడీపీ 1.9శాతం అంటున్నా.. మైనస్ లలోకి వెళ్లే అవ‌కాశం ఉంద‌ని తెలిపారు. కాకపోతే మిగిలిన దేశాల కంటే భాత‌ర్ ప‌రిస్థితి మెరుగ్గా ఉంద‌ని దువ్వూరి సుబ్బారావు అభిప్రాయ‌ప‌డ్డారు.