యూపీలో దారుణం…జామకాయలు కోసినందుకు ఇద్దరు దళిత పిల్లలను చెట్టుకు కట్టేసి కొట్టిన కసాయి

యూపీలోని లకిమ్పూర్ జిల్లాల్లో దారుణం జరిగింది. ఈ జిల్లాలోని గెహువా అనే గ్రామంలో ఓ వ్యక్తికి చెందిన జామ తోటలో జమ చెట్టునుంచి జామకాయలు కోసినందుకు ఇద్దరు దళిత పిల్లలను ఆ వ్యక్తి చెట్టుకు కట్టేసి ఇష్టం వఛ్చినట్టు కొట్టాడు.

యూపీలో దారుణం...జామకాయలు కోసినందుకు ఇద్దరు దళిత పిల్లలను చెట్టుకు కట్టేసి కొట్టిన కసాయి
Two Minor Boy Thrashed

యూపీలోని లకిమ్పూర్ జిల్లాల్లో దారుణం జరిగింది. ఈ జిల్లాలోని గెహువా అనే గ్రామంలో ఓ వ్యక్తికి చెందిన జామ తోటలో జమ చెట్టునుంచి జామకాయలు కోసినందుకు ఇద్దరు దళిత పిల్లలను ఆ వ్యక్తి చెట్టుకు కట్టేసి ఇష్టం వఛ్చినట్టు కొట్టాడు. నిందితుడ్ని 25 ఏళ్ళ కైలాష్ వర్మగా గుర్తించారు. 10,11 ఏళ్ళ తన పిల్లలు కనిపించకుండా పోయేసరికి ఈ పిల్లల తల్లి గాలించగా చెట్టుకు కట్టేసి ఉన్న వీరు ఆమెకు కన్పించారు. అప్పటికే వారు స్పృహ కోల్పోయి ఉన్నారు. ఈ బాలల దుస్థితికి సంబంరందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు స్పందించి వర్మను అరెస్టు చేసి జైలుకు పంపారు. పిల్లలు తాము తప్పు చేశామని…..తమను క్షమించాలని కోరినా వర్మ వినలేదని తెలిసింది. అక్కడికి దగ్గరలోని స్కూలు వద్ద మంచినీటిని తాగేందుకు కొందరు విద్యార్థులు వెళ్లగా వారికీ చెట్టుకు కట్టేసి ఉన్న ఈ ఇద్దరు పిల్లలు కన్పించారు. వారు వెంటనే వెళ్లి తమ తలిదండ్రులకు ఈ విషయం చెప్పారు.

వీరి తల్లి వచ్చి చూసేసరికి అక్కడ వర్మ ఇంకా మద్యం తాగుతూ ఉన్నాడట .. కాగా తమ కుమారుడిపై పోలీసు కేసు ఉపసంహరించుకోవాలని వర్మ తలిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు ఈ దళిత పిల్లల తల్లిని కోరినా ఆమె నిరాకరించినట్టు తెలిసింది. తమకు న్యాయం జరిగేవరకు ఉపసంహరించుకునేది లేదని ఆమె చెప్పినట్టు తెలుస్తోంది .

 

మరిన్ని ఇక్కడ చూడండి: Healthy Diet : చలికాలంలో పాలపదార్ధాలు, రెడ్ మీట్ తినడం తగ్గిస్తే మంచిది ఎందుకంటే..

Karthika: సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న రాధ కూతురు కార్తీక‌.. సినిమాల‌కు గుడ్‌బై చెప్పి ఏం చేయ‌నుందంటే..

Click on your DTH Provider to Add TV9 Telugu